Site icon HashtagU Telugu

Allu Arha: పవర్ స్టార్ సినిమాలో అల్లు అర్జున్ కూతురు.

Allu Arjun's Daughter Allu Arha In Power Star Movie.

Allu Arjun's Daughter Allu Arha In Power Star Movie.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయ్యింది. వాస్తవానికి ఈ సినిమా తమిళ హిట్ మూవీ ‘తెరి’ కి రీమేక్ గా తెరకెక్కుతోందట. పేరుకు రీమేక్ అయినా, పూర్తి స్థాయిలో ఇక్కడి నేటి విటీకి అనుకూలంగా కీలక మార్పులు చేస్తున్నాడట దర్శకుడు. ఈ సినిమాలోని మూల కథకు ఇబ్బంది కలగకుండా రూపొందిస్తున్నాడట. తమిళ సినిమాలో హీరో బేకరి నడుపుతుండగా, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాత్రం లెక్చరర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది.

పవన్ కూతురుగా అల్లు అర్హ (Allu Arha)

ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో పవన్ కల్యాణ్ కు చిన్న పాప ఉంటుందట. ఈ పాప క్యారెక్టర్ కోసం ఎవరిని తీసుకోవాలా? అని దర్శకుడు చాలా ఆలోచించి ఫైనల్ గా  ఓ నిర్ణయానికి వచ్చాడట. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హను (Allu Arha) ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ కూతురుగా అర్హ కనిపించనున్నట్లు సమాచారం. అయితే, అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన  రాలేదు. ఒక వేళ నిజంగానే తాత పవన్ కళ్యాణ్ సినిమాలో మనువరాలు అర్హ నటిస్తే మాత్రం ఫ్యాన్స్ కు పండగే అని చెప్పుకోవచ్చు. సినిమాపైనా మరింత భారీగా అంచనాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అర్హ ‘శాకుంతలం’ సినిమాలో నటించింది. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్హ చిన్ననాటి భరతుడి క్యారెక్టర్ చేసింది. ‘సమంత’ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఇక అర్హ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తండ్రితో కలిసి ఆమె చేసే అల్లరి సోషల్ మీడియాలో నెటిజన్లు బాగా అలరిస్తుంటుంది.

వరుస సినిమాలు చేస్తున్న పవర్ స్టార్

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. క్రిష్ తో కలిసి ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో పవన్ కల్యాణ్ వారియర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా  సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సమ్మర్ కానుకగా విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అటు సుజీత్ తో కలిసి ‘ఓజీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో పాటలు, ఫైట్స్ ఉండవని తెలుస్తోంది. ఓ ప్రయోగాత్మక చిత్రంగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనే విషయం  త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Also Read:  Mumbai: ముంబైలో నిల్చుని టీ తాగుతుంటే.. 42వ అంతస్తు నుంచి జారిపడిన రాయి..