Site icon HashtagU Telugu

Allu Arjun : బీహార్ లో అల్లు అర్జున్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే..

Pushpa 2 Trailer Launch

Pushpa 2 Trailer Launch

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)..ఈ పేరు ఇప్పుడు వరల్డ్ మొత్తం మారుమోగిపోతుంది. పుష్ప ముందు వరకు కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా వినిపించేది..కానీ పుష్ప (Pushpa) తర్వాత అల్లు అర్జున్ కాస్త పుష్పరాజ్ గా మారడమే కాదు వరల్డ్ మొత్తం ఫేమస్ అయ్యాడు. అల్లు అర్జున్ పేరు వింటే చాలు తగ్గేదేలే అని చెపుతున్నారు. అంతలా ఫేమస్ చేసాడు సుకుమార్ (Sukumar).

ఆర్య తో అల్లు అర్జున్ ను యూత్ స్టార్ చేసిన సుకుమార్..పుష్ప తో నేషనల్ స్టార్ ను చేసాడు. ప్రస్తుతం యావత్ సినీ ప్రేక్షకులు పుష్ప 2 కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఎప్పుడు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా..షూటింగ్ ఆలస్యం కావడం తో ఎట్టకేలకు డిసెంబర్ 05 న పాన్ ఇండియా గా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే చిత్ర ప్రమోషన్ ను భారీగా ప్లాన్ చేసారు మేకర్స్. ఈ క్రమంలో రేపు బిహార్లోని పట్నాలో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక ను అట్టహాసంగా జరిపేందుకు ప్లాన్ చేసారు.

దీనికోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తుండగా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే, ఈవెంట్ కు ఎంట్రీ కోసం ఇచ్చే పాస్లను నిర్వాహకులు అందించగా అక్కడ తోపులాట జరిగింది. అభిమానులు భారీగా తరలిరావడంతో గందరగోళం ఏర్పడింది. ఓ తెలుగు హీరో ఈవెంట్ కు బిహార్లో ఇంత క్రేజా అని అక్కడి వారే కాదు తెలుగు వారు కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

Read Also : Diabetes : మధుమేహం ఎముకలను కూడా దెబ్బతీస్తుందా..?