Site icon HashtagU Telugu

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌.. క‌లెక్ష‌న్ల కోస‌మే డ్రామా, నెటిజ‌న్లు ట్రోల్స్‌!

Allu Arjun Jail Again

Allu Arjun Jail Again

Allu Arjun Arrest: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ఒక అభిమానిని కోల్పోయిన విషాద ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు (Allu Arjun Arrest) కావడం కొత్త చర్చకు దారి తీసింది. నెటిజన్లు ఈ అరెస్టును “PR స్టంట్” అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ‘పుష్ప 2’ కలెక్షన్లు 70 శాతం పెరిగాయని పేర్కొన్నాయి. దీనిపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.

ఒక యూజర్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించాడు. ఇదంతా డ్రామా కోసం చేశారు. మూవీ కలెక్షన్లు పెంచాలనే ఉద్దేశం ఉంద‌ని రాసుకొచ్చాడు. మరొక యూజ‌ర్‌.. ఈ అరెస్ట్ సీన్ స్క్రిప్టెడ్ అనిపిస్తుంది? అంటూ సందేహం వ్యక్తం చేశారు. మరో యూజర్ “అరెస్ట్ అంటే కేవలం హైప్ క్రియేట్ చేసి కలెక్షన్లు పెంచడానికే” అని విమర్శించారు. మ‌రో నెటిజ‌న్.. అరెస్ట్ సమయంలో అల్లు అర్జున్ చిరునవ్వుతో ఉండటాన్ని చూసి ఇది PR స్టంట్ అని అర్థమైంద‌ని కామెంట్స్ చేశాడు.

Also Read: Allu Arjun Will Meet Pawan: ప‌వ‌న్‌ను క‌ల‌వ‌నున్న అల్లు అర్జున్‌.. షాక్ ఇవ్వ‌నున్న పోలీసులు!

ఇక‌పోతే డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన పుష్ప‌-2 మూవీ క‌లెక్ష‌న్ల ప‌రంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన ‘పుష్ప 2: ది రూల్స‌.. పుష్ప: ది రైజ్‌కి కొన‌సాగింపుగా వ‌చ్చింది. ఇప్ప‌టికే పుష్ప‌-2 ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 1409 కోట్ల గ్రాస్‌ను సాధించిన‌ట్లు చిత్ర‌యూనిట్ తెలిపింది. అయితే ఈ మూవీ ప్రీమియ‌ర్ షో నాడు హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో రేవ‌తి అని మ‌హిళా అభిమాని మృతిచెందింది. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసుల విచారణలో థియేటర్ యజమాని, ఇద్దరు ఉద్యోగులను అరెస్ట్ చేశారు. వారితో పాటు అల్లు అర్జున్‌ను కూడా అరెస్ట్ చేసి 14 రోజులపాటు రిమాండ్‌కు త‌ర‌లించారు. అయితే హైకోర్టు ఈ కేసులో బ‌న్నీకి మ‌ధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.