Site icon HashtagU Telugu

‘రిపబ్లిక్’ రిలీజ్ కు సాయితేజ్ లేకపోవడం బాధాకరం : అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్!

హీరో సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ లో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ప్రముఖ డైరెక్టర్ దేవకట్టా దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ ఇవాళ రిలీజ్ అయ్యింది. విడుదలైన మొదటిరోజే మంచి టాక్ తెచ్చుకోంది. ఈ సందర్భంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘రిపబ్లిక్ మూవీ రిలీజ్ రోజున సాయితేజ్ మన మధ్య లేకపోవడం బాధాకరం. కజిన్ బ్రదర్ ప్రమాదానికి గురికావడం ఎంతో బాధించింది. సాయితేజ్ త్వరగా కోలుకునేందుకు అభిమానులు ప్రార్థనలు చేయాలి’’ ట్వీట్ చేశారు.

మరో హీరో అల్లు శీరిష్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘మంచి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు..వచ్చినప్పుడే చూసేయాలి. రిపబ్లిక్ ఒక ఊరి సమస్య కాదు.పరిపాలకుల చేతిలో నలిగిపోతున్న ప్రతి ఒక్కరి కథ. ఓటు వేసిన ప్రతిసారి మంచికోసం ఎదురుచూసే ప్రతి ఓటరు కథ’’ అంటూ ట్వీట్ చేశారు.

రీసెంట్ గా రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ సాయితేజ్ ఆరోగ్యం గురించి మాట్లాడారు. సాయితేజ్ ఇంకా కోమాలో ఉన్నారని ఆడియో ఫంక్షన్ లో చెప్పడంతో..  కోలుకోవడానికి ఇంకోన్ని రోజుల సమయం పట్టొచ్చని తెలుస్తోంది. సాయితేజ్ కు వరుసకు మేనమామ అయినా పవన్ కళ్యాణ్ కెరీర్ ఆరంభం నుంచి అండగా నిలుస్తున్నాడు. సాయితేజ్ మరణవార్త తెలియగానే మొదట పవన్ కళ్యాణ్ ఆస్పత్రికి వెళ్లి, మెరుగైన చికిత్స అందించాలని డాక్లరకు సూచించారు.

 

Exit mobile version