Site icon HashtagU Telugu

Allu Arjun Will Meet Pawan: ప‌వ‌న్‌ను క‌ల‌వ‌నున్న అల్లు అర్జున్‌.. షాక్ ఇవ్వ‌నున్న పోలీసులు!

Allu Arjun Will Meet Pawan

Allu Arjun Will Meet Pawan

Allu Arjun Will Meet Pawan: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌ల‌వ‌నున్న‌ట్లు Allu (Arjun Will Meet Pawan) తెలుస్తోంది. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్ చేరుకున్నారు. ఈ క్ర‌మంలోనే పవన్ కళ్యాణ్‌ను అల్లు అర్జున్ కలిసే ఛాన్స్ ఉన్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం విజయవాడ నుండి హైదరాబాద్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో ప‌వ‌న్ ఇంటికి అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబులను అల్లు అర్జున్ క‌లిశారు. త‌రువాత పవన్ కళ్యాణ్ నే కలుస్తారని సమాచారం..? అల్లు అర్జున్ అరెస్ట్ పై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించ‌లేదు. దీంతో పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ కలుస్తారా.. లేదా అనే సస్పెన్స్ కొన‌సాగుతోంది.

Also Read: Sonakshi Warns Mukesh Khanna: న‌టుడికి బ‌హిరంగంగా వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్‌

అల్లు అర్జున్‌కు పోలీసుల‌ షాక్‌?

అల్లు అర్జున్‌కు హైకోర్టు జారీ చేసినా 4 వారాల మ‌ధ్యంత‌ర బెయిల్ ర‌ద్దు కోసం పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఓ టీవీ తెలిపింది. ఇందుకోసం హైకోర్టులో అప్పీల్ చేయ‌నున్న‌ట్లు పేర్కొంది. సంధ్య థియేటర్‌కు వెళ్లేందుకు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని నిన్న ఓ రిపోర్టు బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దాని ఆధారంలో పోలీసులు హైకోర్టులో వాద‌న‌లు వినిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ బెయిల్ ర‌ద్దు అయితే బ‌న్నీ మళ్లీ జైలుకు వెళ్లే అవ‌కాశం ఉంది.

బ‌న్నీని పరామ‌ర్శిస్తున్న టాలీవుడ్‌

మ‌రోవైపు సంధ్య థియేట‌ర్ కేసులో అరెస్టై బెయిల్‌పై విడుద‌లైన బ‌న్నీని టాలీవుడ్ హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ప‌రామ‌ర్శిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే బ‌న్నీని ఇలా ప‌రామ‌ర్శించ‌టం కూడా విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఒక‌వైపు సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన శ్రీతేజ్ ప‌రిస్థితి చాలా విషమంగా ఉండ‌టంతో అత‌న్ని ప‌రామ‌ర్శించ‌డానికి ఒక సెలెబ్రిటీ కూడా వెళ్ల‌లేద‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.