Allu Arjun : దేశ రాజకీయాల్లో ఏపీ ఎన్నికలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పొలిటికల్ రంగానికి సినీ కలర్ కూడా యాడ్ అవ్వడంతో.. నేషనల్ వైడ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలో చర్చనీయాంశం అయ్యింది. మొన్నటివరకు పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుకుండా సైలెంట్ ఆ ఉన్న సినీ పరిశ్రమ.. ఇప్పుడు మద్దతు తెలపడమే కాదు, ఫీల్డ్ లోకి దిగి పవన్ కోసం ప్రచారం చేస్తూ ఫైట్ కూడా చేస్తుంది. ఇక ఈక్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇటీవలే తన మామ పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసారు.
“ప్రజా సేవకు మీ జీవితాన్ని అంకితం చేసి మీరు ఎంచుకున్న మార్గం చూసి నేనెప్పుడూ గర్విస్తాను. ఒక ఫ్యామిలీ మెంబర్ గా నా ప్రేమ, సపోర్ట్ ఎల్లప్పుడూ మీకే. మీరు కోరుకున్నవి అన్ని మీ ఎన్నికల జర్నీలో జరగాలని కోరుకుంటున్నాను” అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేయడంతో నేషనల్ మీడియా కవరేజ్ వచ్చింది. జనసేనకి పుష్ప మద్దతు కూడా లభించడంతో.. మెగా అభిమానులు, జనసైనికులు ఫుల్ ఖుషి అయ్యారు. అయితే అల్లు అర్జున్ కి సంబంధించిన తాజాగా వార్త చూసి జనసైనికులకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు.
ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి వైసీపీ అన్న విషయం తెలిసిందే. అలాంటిది అల్లు అర్జున్ ఒక వైసీపీ నాయకుడిని సపోర్ట్ చేయడం కోసం నంద్యాల వెళ్ళబోతున్నారట. అల్లు అర్జున్ స్నేహితుడైన రవిచంద్ర కిషోర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నంద్యాల నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఈ మిత్రుడు ఎన్నికల్లో గెలవాలని ఆసిస్తూ.. శుభాకాంక్షలు తెలిపేందుకు అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి నంద్యాల వెళ్ళబోతున్నారట.
ఇక ఈ విషయం మెగా అభిమానులకు, జనసైనికుకులకు ఆగ్రహం తెప్పిస్తుంది. పవన్ కి సపోర్ట్ తెలిపి, ఆయన ప్రత్యర్థి పార్టీ నాయకుడి దగ్గరికి ఎలా వెళ్తారు. ఆ మీటింగ్ ని వైసీపీ తమకి మద్దతుగా మార్చుకునే అవకాశం ఉంది కదా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ పర్యటన పై ఇంకా అధికారిక సమాచారం రాలేదు.