Site icon HashtagU Telugu

Allu Arjun Trolled: అల్లు అర్జున్ ఏంటి ఇలా అయ్యాడు.. లుక్స్ పై నెటిజన్స్ ట్రోలింగ్!

Allu Arjun

Allu Arjun

హీరోహీరోయిన్లు ట్రోలింగ్ బారిన పడటం చాలా కామన్ గా మారింది. గతంలో రాధేశ్యామ్ మూవీ ప్రమోషన్స్ సమయంలో హీరో ప్రభాస్ ట్రోల్స్ కు గురయ్యాడు. ప్రభాస్ లుక్ పూర్తిగా మారిందని ఆయన అభిమానులు సైతం కామెంట్స్ చేశారు. తాజాగా అల్లు అర్జున్ కూడా ట్రోలింగ్ బారిన పడక తప్పలేదు. అల్లు అర్జున్ కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విపరీతంగా బరువు పెరిగి, ఏమాత్రం బాడీ షేప్ లేకుండా కనిపించాడు. పుష్పతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన అల్లు అర్జున్ ప్రజెంట్ లుక్ చాలా మందికి షాక్ ఇచ్చింది. వడపావ్ చూడు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. పుష్ప-2 కోసం బరువు పెరిగినా, అలాంటి సీన్స్ ఏమీ లేవని టాలీవుడ్ టాక్.