Site icon HashtagU Telugu

Allu Arjun : పవన్ విజయం పై అల్లు అర్జున్ ట్వీట్.. ఏమన్నాడో తెలుసా..?

Allu Arjun Tweet On Pawan Kalyan Win In Ap Politics 2024

Allu Arjun Tweet On Pawan Kalyan Win In Ap Politics 2024

Allu Arjun : ఎంతో ఉత్కంఠగా నిలిచిన ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది. జగన్ వైసీపీ పార్టీ ఘోర పరాజయాన్ని చూడబోతుంది. ఈ ఉత్కంఠ ఎన్నికల్లో అందరి చూపు పవన్ కళ్యాణ్ విజయం మరియు జనసేన పార్టీ భవిషత్తు. ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ తో పవన్ మరియు ఆయన పార్టీ జనసేన గట్టి పునాధులనే వేసుకోబోతుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో పాటు తన ఇతర జనసేన నాయకులను కూడా గెలిపించుకున్నారు.

దీంతో పవన్ కి ప్రజల నుంచి విశేషమైన అభినందనలు వస్తున్నాయి. సినిమా సెలబ్రిటీస్ కూడా పవన్ కి విషెస్ తెలియజేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈక్రమంలోనే అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేసారు. ఈ ఎన్నికల్లో అల్లు అర్జున్.. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మెగా హీరోలంతా పవన్ కోసం ఫీల్డ్ లోకి దిగి పోరాడుతున్న వేళ.. అల్లు అర్జున్ వైసీపీ లీడర్ కి సపోర్ట్ చేయడం జనసైనికులకు, మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.

కాగా ఈ ఎన్నికల్లో అల్లు అర్జున్ మద్దతు తెలిపిన వైసీపీ లీడర్ శిల్ప రవి ఓటమి పాలయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని జనసైనికులు, మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఈ సమయంలో అల్లు అర్జున్.. పవన్ అభినందిస్తూ ట్వీట్ చేసారు. పవన్ ఘన విజయాన్ని తాను హృదయపూర్వకంగా అభినందిస్తునట్లు చెప్పుకొచ్చారు. “సంవత్సరాల తరబడి ప్రజలకు సేవ చేయాలనే పవన్ కృషి, అంకితభావం మరియు నిబద్ధత ఎల్లప్పుడూ తన హృదయాన్ని హత్తుకునేవని, ప్రజలకు సేవ చేయాలనే పవన్ కొత్త ప్రయాణానికి తన శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.