Site icon HashtagU Telugu

Allu Arjun: భారీ ఆఫర్ ను తిరస్కరించిన అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫిదా

Allu Arjun

Allu Arjun

‘ ఐకాన్ స్టార్ ‘ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా అల్లు అర్జున్ నిలుస్తున్నారు. యాక్షన్ లొనే కాదు.. ఆలోచనా విధానంలోనూ ఆయన హీరో అని నిరూపించుకుంటున్నారు. ఇటీవల అల్లు అర్జున్ తీసుకున్న ఒక నిర్ణయం.. అభిమానుల దృష్టిలో ఆయన విలువను మరింత పెంచింది. పొగాకు ఉత్పత్తులు విక్రయించే ఒక బ్రాండ్ ఇటీవల అల్లు అర్జున్ ఇంటి తలుపు తట్టింది. ‘ మా కంపెనీ అడ్వర్టైజ్మెంట్ లో యాక్ట్ చేస్తే .. కోట్లు కుమ్మరిస్తాం’ అని చెప్పింది. కేవలం డబ్బే లక్ష్యంగా బతికే హీరోలు అయితే.. వెంటనే ఒకే చెబుతారు. కానీ బన్నీ .. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దీనికి ‘ నో ‘ చెప్పేశారట. ‘ నేను ఒకవేళ పొగాకు ఉత్పత్తుల ను ప్రమోట్ చేస్తే.. నా అభిమానులు నన్ను ఫాలో అవుతారు. కాబట్టి మీరు ఎన్ని డబ్బులిచ్చినా ఈ యాడ్ చేయలేను. అటువంటివి ప్రోత్సహించను ‘ అని బన్నీ తేల్చి చెప్పారట. అల్లు అర్జున్ కు ధూమపానం అలవాటు లేదు. కాబట్టి తన ఫ్యాన్స్ కూడా తనలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు అని ఈఘటనతో స్పష్టమైంది. అభిమానుల్లోకి తప్పుడు సందేశం వెళ్లకూడదనే ఒకే ఒక్క కారణంతో .. ఇంత పెద్ద ఆఫర్ ను వదులుకున్న అల్లు అర్జున్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

రాబోయే బన్నీ సినిమాలు..

దర్శకుడు సుకుమార్ తీయనున్న తదుపరి సినిమా ‘ పుష్ప ది రూల్’ లో అల్లు అర్జున్ నటించనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్
జూన్ నుంచి మొదలు కాబోతోంది. డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ‘ ఐకాన్’ , కొరటాల శివ తీయనున్న ఒక థ్రిల్లర్ మూవీలలోనూ బన్నీ యాక్ట్ చేయనున్నారు. ఏఆర్ మురుగదాస్, ప్రశాంత్ నీల్, బోయపాటి శ్రీను లతో చెరో సినిమా కూడా అల్లు అర్జున్ చేయనున్నారు.