పుష్ప 2 రిలీజ్ రోజు సంధ్యా ధియేటర్‌లో (Sandhya Theater Incident) జరిగిన తొక్కిసలాటలో గాయపడి కోమాలోకి వెళ్లిన శ్రీతేజ (Sri Teja ) అనే పిల్లవాడిని మంగళవారం హీరో అల్లు అర్జున్ (Allu Arjun)పరామర్శించారు. ఈనెల 4న ఘటన జరగగా, అప్పటినుంచి బేగంపేట్లోని కిమ్స్ ఆస్పత్రిలో బాలుడు చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్ట్ అనుమతులతో ఈరోజు ఉదయం అల్లు అర్జున్ తో పాటు నిర్మాత దిల్ రాజు బాలుడిని పరామర్శించారు.
అల్లు అర్జున్ రాక నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది…? తదితర ఆరోగ్య విషయాలను డాక్టర్స్ ను అడిగి అల్లు అర్జున్ తెలుసుకున్నారు. బాలుడికి సంబంధించి అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని , బాలుడి ఆరోగ్యం కుదుటపడేందుకు తాము మద్దతుగా ఉంటామని కుటుంబ సబ్యులకు ఆయన హామీ ఇచ్చారు.
Border-Gavaskar Trophy: ఆస్ట్రేలియాతో సిరీస్‌ను కోల్పోయిన టీమిండియాకు భారీ షాక్!
అలాగే, పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన ప్రమాదం తనను తీవ్రంగా బాధించిందని, అటువంటి ఘటనలు ఇకపై జరగకుండా చూసుకుంటామని తెలిపారు. ఇక నిర్మాత దిల్ రాజు కూడా శ్రీతేజ ఆరోగ్యం గురించి ఆసుపత్రి వర్గాల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పిన ఆయన, అన్ని విధాలా తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అల్లు అర్జున్ ఈ విధంగా బాధిత కుటుంబానికి అండగా నిలవడం, తన వంతు బాధ్యతగా సహాయం చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇక శ్రీతేజ్ అల్లుఅర్జున్ కు వీరాభిమాని. ప్రస్తుతం ఈ పిల్లవాడి ఆరోగ్యం పరిస్థితి పూర్తిగా ఎప్పుడు కోలుకుంటుంది అనే వివరాలు ఇంకా వైద్యులు ప్రకటించలేదు. మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల కోమాలోకి వెళ్లాడని పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజను పరామర్శించేందుకు బేగంపేట్లోని కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న అల్లు అర్జున్ కిమ్స్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు #AlluArjun #SandhyaTheatreTragedy #HashtagU pic.twitter.com/5dUyTPfmPN
— Hashtag U (@HashtaguIn) January 7, 2025