సుకుమార్, అల్లు అర్జున్ కలయికలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కూడా పుష్ప సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ పార్ట్ -2ను పట్టాలెక్కించే పనిలో బిజీబిజీగా ఉన్నాడు. అందుకోసం పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతున్నాడు. ఇటీవలనే పూజా కార్యక్రమాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎందుకంటే తరువాతి మూడు నెలలు తరువాత ఎటువంటి శుభ దినాలు లేవు. బన్నీ కూడా న్యూయార్క్‌లో ఉన్నాడు. షూటింగ్ చేయడానికి ముందు తన కుటుంబంతో తగినంత సమయం గడుపుతున్నాడు. సెప్టెంబరు మూడో వారం లో పుష్ప పార్ట్-2 మొదలుకానుంది. అప్పుడే హీరోయిన్ రష్మిక టీమ్‌లో జాయిన్ అవుతుందనేది టాలీవుడ్ టాక్. దీంతో సుకుమార్ స్క్రిప్ట్ తో పాటు మ్యూజిక్ పనుల్లో నిమగ్నమయ్యాడు.
ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే సుక్కు ఇతర టీమ్ సభ్యులతో వాటిని మళ్లీ వర్క్ చేస్తున్నాడని సమాచారం. DSP, ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. మేం పుష్ప: పార్ట్ 1లో పని చేస్తున్నప్పుడు సంగీతం గురించి పలు చర్చలు కొనసాగాయి. తెలియకుండానే రెండు పాటలు స్వీకెల్ కోసం చేయబడ్డాయి. ఇది అద్భుతమైన విషయం. పార్ట్ -1 లో పాటలు ఎంతగా హిట్ అయ్యాయో.. అంతకుమించి మ్యూజిక్ చేస్తున్నామని అన్నాడు. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించిన పుష్ప పాన్ మూవీ విడుదలైన విషయం తెలిసిందే.
