Site icon HashtagU Telugu

Allu Arjun Statue: మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున్‌ విగ్రహం..!

Allu Arjun Statue

Is There Politics Behind Allu Arjun's Award

Allu Arjun Statue: మేడమ్‌ టుస్సాడ్స్‌ (Madame Tussauds) మ్యూజియంలో మైనపు విగ్రహం కలిగి ఉండడం గొప్ప గౌరవంగా భావిస్తారు సినీ ప్రముఖులు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. ఇటీవల ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న స్టైలిష్ స్టార్.. ఇప్పుడు మరో రేర్ ఫీట్ ను అందుకోబోతున్నాడు.

లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun Statue) మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రతి ఒక్కరు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఈ మ్యూజియంలో ఇప్పటికే తెలుగు హీరోలు ప్రభాస్‌, మహేశ్‌బాబు మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు. తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే అల్లు అర్జున్ ఈ విగ్రహం కోసం కొలతలు ఇవ్వడానికి లండన్ వెళ్లనున్నాడట.

Also Read: Tollywood : పాపం శివాత్మిక…గట్టిగానే చూపిస్తుంది కానీ..చాన్సులే రావట్లే

మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున్‌కు చోటు దక్కిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. త్వరలోనే బన్నీ లండన్‌ వెళ్లి తన మైనపు విగ్రహానికి సంబంధించి కొలతలు ఇవ్వనున్నట్లు సమాచారం. రెండు రోజులు అక్కడే ఉండి ఈ ప్రక్రియ పూర్తి చేసుకుని తిరిగి ఇండియాకు వస్తారని తెలుస్తుంది. వచ్చే ఏడాదిలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని సమాచారం అందుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ ఘనత సాధించిన మూడో టాలీవుడ్‌ హీరోగా బన్నీ నిలుస్తాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2లో నటిస్తున్నాడు. పుష్పకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. పుష్ప పార్ట్ 1 దేశవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. పుష్ప 2 పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగష్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.