Site icon HashtagU Telugu

Pushpa 2 : తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్

Allu Arjun Released

Allu Arjun Released

పుష్ప-2 సినిమా టికెట్ ధరల పెంపు (Pushpa 2 Ticket Price Hike)నకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అనుమతినిచ్చిన నేపథ్యంలో..హీరో అల్లు అర్జున్ సామాజిక మాధ్యమం X వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం తెలుగు సినిమా పరిశ్రమ ఎదుగుదలకు కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రాష్ రష్మిక (Allu Arjun-Rashmika) జంటగా..లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ పుష్ప 2 (Pushpa 2). మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా పుష్ప మేనియా నడుస్తుంది. పుష్ప 2 ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులే కాదు సినీ ప్రముఖులు సైతం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటె రెండు తెలంగాణ రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వడం తో మేకర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ లో దాదాపు 18 రోజుల వరకు టికెట్ ధరలు భారీగా పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది.

ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి హీరో అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం తెలుగు సినిమా ఎదుగుదలను ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు సినిమా, ఇండస్ట్రీకి సపోర్ట్ నిలుస్తోన్న సీఎం రేవంత్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.

పుష్ప 2 తెలంగాణ టికెట్ ధరలు చూస్తే..

డిసెంబ‌ర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోల‌తో పాటు అర్ధరాత్రి 1 షోల‌కు అనుమతినిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సింగిల్ థియేట‌ర్‌ల‌లో, మల్టీఫ్లెక్స్‌ల్లో ఈ బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు రూ.800గా ఖరారు చేసింది. మ‌రోవైపు అర్థరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఎక్స్‌ట్రా షోలకు అనుమతినిచ్చింది. డిసెంబ‌ర్ 05 నుంచి 08 వ‌ర‌కు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచింది. అలాగే.. డిసెంబ‌ర్ 09 నుంచి 16 వరకు సింగిల్ థియేట‌ర్‌ల‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతిని ఇచ్చింది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ థియేట‌ర్‌ల‌లో రూ.20 మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దాదాపు 18 రోజులు ఈ పెంచిన రేట్లు అమ‌లులో ఉండ‌నున్నట్లు వెల్లడించింది.

ఏపీ సర్కార్ సైతం టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది. డిసెంబర్ 4న ప్రీమియర్ షో రా.9.30 గంటలకు ఒక టికెట్ రూ.800గా నిర్ణయించింది. డిసెంబర్ 5 నుంచి 17 వరకు గరిష్ఠంగా రూ.200 వరకు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్సుల్లో రూ.200, సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాసుకు రూ. 100, అప్పర్ క్లాసుకు రూ.150 వరకు పెంచుకునే అవకాశం ఇచ్చింది.

Read Also : Eknath Shinde Health : సీఎం ఏక్నాథ్ శిండే ఆరోగ్యం విషమం ..?