Site icon HashtagU Telugu

Pushpa 2 Ticket Price Hike : పవన్ కళ్యాణ్ కు థాంక్స్ తెలిపిన అల్లు అర్జున్

Bunny Thanks Pawan

Bunny Thanks Pawan

పుష్ప-2 సినిమా టికెట్ ధరల పెంపు (Pushpa 2 Ticket Price Hike)నకు ఏపీ ప్రభుత్వం (AP Govt) అనుమతినిచ్చిన నేపథ్యంలో..హీరో అల్లు అర్జున్ సామాజిక మాధ్యమం X వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం తెలుగు సినిమా పరిశ్రమ ఎదుగుదలకు కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రాష్ రష్మిక (Allu Arjun-Rashmika) జంటగా..లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ పుష్ప 2 (Pushpa 2). మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా పుష్ప మేనియా నడుస్తుంది. పుష్ప 2 ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులే కాదు సినీ ప్రముఖులు సైతం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటె చాల చోట్ల టికెట్ ధరలు భారీగా పెంచారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం టికెట్ ధరలు విపరీతంగా పెరిగాయి. తెలంగాణ లో డిసెంబరు 5 నుంచి 8 వరకు:
సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ.150 ,
మల్టీప్లెక్స్‌లలో రూ.200 పెంపు

డిసెంబరు 9 నుంచి 16 వరకు:

సింగిల్ స్క్రీన్‌లో రూ.105 పెంపు
మల్టీప్లెక్స్‌లలో రూ.150 పెంపు

డిసెంబరు 17 నుంచి 23 వరకు:
సింగిల్ స్క్రీన్‌లో రూ.20
మల్టీప్లెక్స్‌లలో రూ.50 అదనంగా ఛార్జ్ చేయడానికి అనుమతి ఇవ్వగా..ఇప్పుడు ఇదే బాటలో ఏపీ సర్కార్ సైతం టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది. డిసెంబర్ 4న ప్రీమియర్ షో రా.9.30 గంటలకు ఒక టికెట్ రూ.800గా నిర్ణయించింది. డిసెంబర్ 5 నుంచి 17 వరకు గరిష్ఠంగా రూ.200 వరకు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్సుల్లో రూ.200, సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాసుకు రూ. 100, అప్పర్ క్లాసుకు రూ.150 వరకు పెంచుకునే అవకాశం ఇచ్చింది.

ఈ సందర్బంగా అల్లు అర్జున్ (Allu Arjun) ఏపీ సర్కార్ కు సామాజిక మాధ్యమం X వేదికగా తన కృతజ్ఞతలు తెలిపారు. “తెలుగు చిత్ర పరిశ్రమకు మద్దతు ఇస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అద్భుతం. ఇలాంటి ప్రోత్సాహక చర్యలు ఇండస్ట్రీకి మరింత ఊతమివ్వగలవు,” అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(CM CHandrababu)కు, అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు అండగా నిలుస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని పేర్కొన్నారు. “పవన్ కళ్యాణ్ గారి మద్దతు వల్ల సినిమా రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను” అని ట్వీట్ చేసారు.

Read Also : Health Festival : ఆరోగ్య ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్