Site icon HashtagU Telugu

Success Party: ‘పుష్ప’ సక్సెస్ నాది కాదు.. మీ అందరిది!

allu arjun

allu arjun

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తోంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో అభిమానుల కోలాహలం మధ్య ఈ సినిమా సక్సెస్ పార్టీ జరిగింది. చిత్ర యూనిట్ అందరూ ఇందులో హాజరయ్యారు..

పుష్ప గ్రాండ్ సక్సెస్ పార్టీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమా కోసం తాను పడిన కష్టం కంటే చిత్ర యూనిట్ ఇంకా ఎక్కువ కష్టపడ్డారు అంటూ అందరినీ ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’ రెండు సంవత్సరాలుగా చిత్తూరు గురించి బాగా తెలుసుకుంటున్నాను. ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు.. వాళ్ళ భాష యాస ఎలా ఉంటుంది.. అనేది అన్ని నేర్చుకున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఒక్క ఈవెంట్ అయినా చిత్తూరులో పెట్టాలి అనుకున్నాము. అనుకున్నట్టుగానే మొదటి ఫంక్షన్ ఇక్కడ చేయడం ఆనందంగా ఉంది. సుకుమార్ అంటే సుకుమారంగా ఉంటారు అనుకుంటిరా ఫైర్.. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. పుష్ప నుంచి నాకు పేరు వచ్చిన.. ఇంకేది వచ్చిన అంతా మా సుకుమార్ గారిదే. ఇంకా ఇంతకంటే సినిమా గురించి నేనేం చెప్పలేను. మీ వెనకాల ఆ ఏడుకొండల స్వామి ఎలా ఉన్నాడో.. నా వెనకాల మా సుకుమార్ అలా ఉన్నాడు.. ఇంతకంటే ఇంకా ఏం చెప్పాలి. మా శ్రీవల్లి కేవలం సినిమాలో మాత్రమే కాదు బయట కూడా చాలా నచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ పాటలు ఎలా ఉన్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక భాషలో కాదు అన్ని భాషల్లో ఇంత అద్భుతంగా పర్ఫామెన్స్ చేస్తుంటే థాంక్యూ తప్ప ఇంకేమీ చెప్పలేకపోతున్నాను.. బడ్జెట్ విషయంలో అన్నిట్లోనూ మాకు ఎప్పుడూ అండగా నిలిచిన మైత్రి మూవీ మేకర్స్ కు థాంక్స్. ముత్తంశెట్టి మీడియాకు కూడా నేను తిరిగి ప్రేమ చూపించే టైం వచ్చింది. సినిమాలో నాతో పాటు నటించిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్. మీరు అంత బాగా సపోర్ట్ చేశారు కాబట్టే నా పర్ఫామెన్స్ బాగుంది. సినిమా ఇంత పెద్ద విజయం అందించినందుకు మరోసారి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు..’ అని తెలిపారు.

పుష్ప సినిమా సక్సెస్ పార్టీలో దర్శకుడు సుకుమార్ తన యూనిట్ ను అందరికీ పరిచయం చేశారు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ గురించి ప్రేక్షకులకు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’ ఈ సినిమా కథ పుట్టడానికి కారణం ఆ మూడో అన్నయ్య విజయ్. బాగా చూడు ఉన్న కథ చేయాలి అనుకుంటున్న సమయంలో.. విజయ్ అన్నయ్య ఇచ్చిన ఐడియా ఈ సినిమా కధకు బీజం వేసింది. పుష్ప సినిమా కోసం రెండేళ్లు నాతో పాటు ఎంతమంది పగలు రాత్రి నిద్ర లేకుండా కష్టపడ్డారు. నా చుట్టుపక్కల ఎప్పుడు నన్ను ఇన్స్పయిర్ చేసేవాళ్లను ఉంచుకుంటాను. చాలా చాలా మంది నా చుట్టూ ఉన్నారు. ముఖ్యంగా నా డైరెక్షన్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీరిలో ఏ ఒక్కరు లేకపోయినా కూడా ఈ సినిమా సాధ్యం కాదు. అలాగే నా ఆర్ట్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ, సంగీతం.. ఇలా ప్రతి ఒక్కరూ సినిమా కోసం ప్రాణం పెట్టారు. సినిమా కరోనా సమయంలో అడవుల్లో వెళ్లి షూట్ చేసాం. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మిగిలిన విషయాలు హీరో బన్నీ గారు మాట్లాడతారు..’ అని తెలిపారు.

తిరుపతిలో జరిగిన పుష్ప సక్సెస్ పార్టీలో హీరోయిన్ రష్మిక మందన మాట్లాడుతూ..’ అల్లు అర్జున్ గారు మీకు నేను ఫ్యాన్ కాదు అంతకు మించి.. సినిమాలో ఎంత అద్భుతంగా నటించారు..? ఖచ్చితంగా ఈ ఏడాది నేషనల్ అవార్డులతో పాటు అన్ని అవార్డులు మీకు రాకపోతే నేను హర్ట్ అవుతాను. సుకుమార్ గారు మీ డైరెక్షన్ సూపర్.. మీ ఇద్దరు కలిసి చించేశారు. స్క్రీన్ మీద ఎనర్జీ చూస్తుంటే మాట్లాడటానికి మాటలు సరిపోవడం లేదు. డీఎస్పీ గారు మీ పాటలు అద్భుతం. ప్రతి ఒక్క పాట అదిరిపోయింది. మా టీం కు ఎక్కువగా దిష్టి తగులుతుంది. అందుకే ఆ దిష్టి నేను తీసుకుంటున్నాను. పుష్ప సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ ఎంతో కష్టపడ్డారు. కావాల్సిన ప్రతి ఒక్కటి కాదనకుండా ఇచ్చారు. ఈరోజు ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది అంటే దానికి కారణం మైత్రి మూవీ మేకర్స్. సునీల్ గారు మీరు అద్భుతంగా నటించారు. మొదటి సారి మిమ్మల్ని చూసినట్టు గుర్తు పట్టలేకపోయాను. కుబా సర్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ సార్ మీది. సినిమా ఇంత అద్భుతంగా వచ్చిందంటే దానికి మీరు కూడా ఒక ప్రధానమైన కారణం. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు..’ అని తెలిపారు.