అక్కినేని గారి ఫ్యామిలీ తో మా జర్నీ ఇలాగే కొన సాగుతుంది!

మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ పతాకంపై అఖిల్ అక్కినేని ,బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరో, హీరోయిన్లు గా.త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్లీగా వుండేలా డిజైన్ చేసే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

  • Written By:
  • Publish Date - October 21, 2021 / 03:20 PM IST

మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ పతాకంపై అఖిల్ అక్కినేని ,బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరో, హీరోయిన్లు గా.త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్లీగా వుండేలా డిజైన్ చేసే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.” భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా కలసి నిర్మించిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని ఏరియాల నుండి హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించ బడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ ల్లో గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హీరో అల్లు అర్జున్, దర్శకుడు వంశీ పైడి పల్లి,దర్శకుడు సురేందర్ రెడ్డి తదితర సినీ ప్రముఖులు ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాలుపంచుకొని ఇంత మంచి సినిమా తీసిన చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిధిగా పుష్పరాజ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడారు.

సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న అఖిల్ కు కంగ్రాజులేషన్. అఖిల్ ని చూస్తే నాకు యంగర్ బ్రదర్ లా అనిపిస్తుంది అఖిల్ సినిమా రాకముందే నేను నాగార్జున సార్ ని కలిశాను అఖిల్ ని ఇలా చేస్తే బాగుంటుందా అనేసి నా చిన్న సలహా ఇచ్చి కలవడం జరిగింది. ఇష్టం ఉంది కాబట్టే వేరే ఫ్యామిలీ హీరో అయినా కూడా నేను వెళ్లి చెప్పడం జరిగింది. అలాంటి అఖిల్ కి ఈ రోజు ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అక్కినేని గారి ఫ్యామిలీ తో మా ప్రయాణం చాలా సంవత్సరాలుగా సాగుతుంది. ఫ్యూచర్ లో కూడా మా జర్నీ అలాగే కంటిన్యూ సాగుతుంది..లవ్ స్టోరీ సినిమా ద్వారా చైతన్య గారు, ఇపుడు అఖిల్ ఇద్దరూ మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఇద్దరు బ్రదర్స్ కూడా ఒకే సీజన్ లో సూపర్ హిట్ కొట్టారు. వీరిద్దరికీ కంగ్రాచులేషన్. పూజాను నేను డీజే నుంచి చూస్తున్నాను సినిమా తర్వాత సినిమా తన పెర్ఫార్మన్స్ తో బెటర్మెంట్ ఇస్తూ ఉంది. మా నాన్నగారిని నేను నలభై సంవత్సరాలుగా చూస్తున్నాను ఆయన ఎప్పుడు కష్ట పడుతూనే ఉంటాడు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ … ఈ సినిమాను ప్రేమించుకుందాం అనుకునేవారు, ప్రేమించుకునే వాళ్ళు, ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకునేవారు, పెళ్లి చేసుకోవద్దు విడిపోదాం అనుకునే వారు, పెళ్లి చేసుకుని కాపురాలు చేస్తున్నవారు, పెళ్లి చేసుకుని 40 ఏళ్లుగా కాపురం చేసుకున్న వాళ్లు వీరందరూ కూడా ఈ సినిమా చూడాలి.ఎందుకంటే ఏ ఏ స్టేజి లో మనం మన కాపురాలు ఎలా చేశాము అనేది చూసుకోవడానికి నాలాంటి వయసు మళ్ళిన వాళ్ళు వెనక్కి చూసుకుంటే తెలుస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఈ సినిమా
చూడాలి. ఇది కమర్షియల్ గా మాట్లాడే మాట కాదు భాస్కర్ ఈ కథలో అటువంటి క్లారిటీ ఇచ్చాడు.
సింపుల్గా చెప్పాలంటే “వాట్ డు యు యాక్సెప్ట్ ఫ్రమ్ యువర్ మ్యారేజ్ లైఫ్” అనే పదము సినిమాలోచాలా సార్లు వస్తుంది. కానీ రియల్ లైఫ్ లో ప్రతి ఒక్కరూ తిరిగి చూసుకునేలా ఈ సినిమా ఉంటుంది.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. మంచి సినిమా మంచి కథ వస్తే సినిమాను గుండెల్లో పెట్టుకొని చూస్తారు అనేది ఈ సినిమా నిరూపించింది. కోవిడ్ రాకముందు ఇండియన్ సినిమా మొత్తం కూడా తెలుగు సినిమా వైపు చూసేది. కొవిడ్ తర్వాత కూడా థియేటర్స్ లలో సినిమా రిలీజ్ చేయడానికి సహసించేవారు కాదు.అలాంటి టైం లో తెలుగు సినిమాలు థియేటర్స్ లలో విడుదల చేయడంతో ఇండియన్ సినిమాకు తెలుగు సినిమాలే మొదట దిక్సూచిగా మారాయి.  దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ..ఒక మంచి టీం నిజాయితీగా కలిసి పని చేస్తే సక్సెస్ అనేది ఈజీ గా వస్తుంది దీనికి ఉదాహరనే ఈ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. అరవింద్ గారితో రెండు సినిమాలకూ వర్క్ చేయడం ద్వారా చాలా నేర్చుకున్నాను.  నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ.. చాలా తక్కువ సినిమాలకే ఇంత పెద్ద సక్సెస్ మీట్ పెట్టుకునే అవకాశం ఇస్తుంది. ఇలాంటి అవకాశం ఈ సినిమాకు ఇచ్చిన ప్రేక్షకులకు నా ధన్య వాదాలు.  చిత్ర దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ .. ఈ సినిమా అల్లు అరవింద్ గారి బ్యానర్లో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. వాసు వర్మ, బన్నీ వాసు, గోపి సుందర్ లు నాకు ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచారు
ఈ సినిమాతో నేను అందరికీ దగ్గర అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. హీరోయిన్ పూజ హెగ్డే మాట్లాడుతూ .. సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికీ ఒక మంచి ఊపిరి నిస్తుంది.ఈ సినిమా కోసం అందరూ కూడా చాలా ఎఫెక్ట్ పెట్టి వర్క్ చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది.