Allu Arjun: అల్లు అర్జున్ సర్ప్రైజ్ వచ్చేసింది.. వీడియో వైరల్..!

ఈరోజు సర్ప్రైజ్ ఇస్తానన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. ఇన్స్టాగ్రామ్ కొలాబరేట్ అయి ఓ వీడియోను షేర్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Allu Arjun

Allu Arjun gets National Best Actor Award first time for Telugu Actors in 69 Years

Allu Arjun: ఈరోజు సర్ప్రైజ్ ఇస్తానన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. ఇన్స్టాగ్రామ్ కొలాబరేట్ అయి ఓ వీడియోను షేర్ చేశారు. పుష్ప-2 సినిమా షూటింగ్ ఎలా జరుగుతోందో అందులో చూపించారు. ఇండియాలోనే అతిపెద్ద స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోందని, అక్కడ చాలా మంది అభిమానులు తనను కలవడానికి వస్తున్నారని బన్నీ చెప్పారు. పుష్ప-2లో తనది నెవర్ గివ్-అప్ క్యారెక్టర్ అని మూవీపై అంచనాలను పెంచారు.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఇన్ స్టాలో బన్నీ తన దినచర్యను చూపించాడు. తన దినచర్య ఎలా ప్రారంభమవుతుందో తెలపడంతో పాటు ‘పుష్ప2’కు సంబంధించిన మేకింగ్‌ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ఉదయం లేచినప్పటి నుంచి షూటింగ్ ముగిసే వరకు తాను ఏయే పనులు చేస్తాడో వివరించాడు. ఇందులో మూవీ కోసం వేసిన సెట్స్, అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్, సెట్లోకి ఎంటరయ్యే విధానం, యాక్షన్ నుంచి కట్ వరకు షూటింగ్ సాగిన తీరు ఆకట్టుకుంది. ఇందులో తన అభిమానుల గురించి చెప్పిన అల్లు అర్జున్.. పుష్ప తనకెంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు.

Also Read: Pawan Kalyan: పవన్ పై ఎన్నికల ఎఫెక్ట్, ఆ సినిమాల షూటింగ్స్ రద్దు చేసుకోవాల్సిందేనా!

రామోజీ ఫిల్మ్‌ సిటీలో షూటింగ్‌ జరుగుతోన్న పుష్ప2 సెట్స్‌ను చూపించిన అల్లు అర్జున్‌.. వేరే దేశాల్లో కంటే భారత్‌లో అభిమానులు చాలా భిన్నంగా ఉంటారు. వాళ్ల ప్రేమను వివరించడం కష్టం. పుష్ప2 షూటింగ్‌ జరుగుతున్న సమయంలో నా కోసం ఎంతో మంది అభిమానులు వచ్చారు. వీళ్ల ప్రేమ నన్ను సరిహద్దులను అధిగమించేలా చేస్తోంది. నన్ను చూసి వాళ్లు గర్వపడేలా ఉంటాను అని తెలిపాడు. ఇక సుకుమార్ కూడా ఈ వీడియోలో భాగం కాగా.. లక్షల మంది లైక్, షేర్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అల్లు అర్జున్‌ మంగళవారం సాయంత్రం తన ఇన్‌స్టాలో సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు తెలుపుతూ పోస్ట్‌ పెట్టిన దగ్గర నుంచి అభిమానులంతా దానికోసం ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా పంచుకున్న ఈ వీడియోతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.

  Last Updated: 30 Aug 2023, 12:09 PM IST