Site icon HashtagU Telugu

Pushpa 2 Sooseki Song Promo : సూసేకి అగ్గిపుల్ల మాదిరి.. శ్రీవల్లి సాంగ్ ప్రోమో..!

Allu Arjun Pushpa 2 Special Song Confusion Continues

Allu Arjun Pushpa 2 Special Song Confusion Continues

Pushpa 2 Sooseki Song Promo సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప 1 సెన్సేషనల్ హిట్ కాగా పుష్ప పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ అంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు ఆడియన్స్ కు ఈక్వల్ గా నార్త్ సైడ్ పుష్ప రాజ్ మాస్ హంగామా కోసం ఎగ్జైటెడ్ గా ఉన్నారు. పుష్ప 2 సినిమా నుంచి ఇప్పటికే పుష్ప పుష్ప సాంగ్ రిలీజ్ కాగా సినిమా నుంచి మరో సాంగ్ సూసేకి సాంగ్ రిలీజ్ కాబోతుంది. దీనికి సంబందించిన అనౌన్స్ మెంట్ శ్రీవల్లి అదే రష్మిక మందన్న రిలీజ్ చేసింది.

పుష్ప రాజ్ స్నేహితుడు కేశవ శ్రీవల్లి వదిన దగ్గరకు వెళ్లి రెండో సాంగ్ అప్డేట్ ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు శ్రీవల్లి మోడ్రెన్ డ్రెస్ లో సూసేకి అగ్గిపుల్ల మాదిరి అంటూ మరో సామి సాంగ్ లోడింగ్ అంటూ హింట్ ఇచ్చేందుకు. పూర్తి సాంగ్ 29న రిలీజ్ కాబోతుంది. పుష్ప 2 పై ఉన్న అంచనాలకు దేవి శ్రీ ప్రసాద్ కూడా తన డ్యూటీ తాను చేస్తూ సత్తా చాటాలని చూస్తున్నాడు.

పుష్ప 1 ఆ రేంజ్ లో హిట్ అవ్వడానికి సాంగ్స్ కూడా ప్రధాన కారణమని చెప్పొచ్చు. దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు మరోసారి పుష్ప 2 కోసం అదరగొట్టే సంగీతం అందించాడని తెలుస్తుంది. పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా మీద అంచనాలకు తగినట్టుగానే బిజినెస్ కూడా జరుగుతుంది. పుష్ప 2 మ్యూజిక్ పరంగా చార్ట్ బస్టర్ అనిపించేందుకు దేవి పూర్తిస్థాయిలో కష్టపడుతున్నాడు.