Site icon HashtagU Telugu

Pushpa 2 : పుష్ప 2 కన్నడలో రికార్డ్ బిజినెస్.. ఏ హీరో వల్ల కాలేదు..!

Allu Arjun Pushpa 2

Pushpa2

Pushpa 2 అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా బిజినెస్ విషయంలో దుమ్ము దులిపేస్తుంది. సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ఇవన్నీ సినిమా బిజినెస్ కు సహకరిస్తున్నాయి. తెలుగుతో పాటు కేరళ తన అడ్డగా మార్చుకున్న అల్లు అర్జున్ మలయాళ వెర్షన్ ని కూడా భారీ ధరకు అమ్మేసినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 కన్నడ రైట్స్ కూడా బ్లాస్టింగ్ ప్రైజ్ దక్కాయని తెలుస్తుని. తెలుస్తున్న సమాచారం ప్రకారం పుష్ప 2 కన్నడ రైట్స్ ని 32 కోట్లకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకుందట.

పుష్ప 2 పై ఉన్న బజ్ కి ఆ సినిమా అనుకున్న అంచనాలను రీచ్ అయితే మాత్రం సినిమా వసూళ్లు ఆపడం కష్టం. పుష్ప 2పై కన్నడలో కూడా భారీ హైప్ ఉంది. అందుకే ఈ రేంజ్ ధర పలికినట్టు తెలుస్తుంది. పుష్ప 2 సినిమాతో మరోసారి తన ఊర మాస్ యాటిట్యూడ్ తో అదరగొట్టాలని చూస్తున్నాడు అల్లు అర్జున్.

సుకుమార్ కూడా సీక్వెల్ పై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ప్లాన్ చేస్తున్నారట. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యేలా ఉందని అంటున్నారు. పుష్ప 2 సినిమా ముందు ఆగష్టు 15న రిలీజ్ షెడ్యూల్ చేసుకోగా ఇప్పుడు డిసెంబర్ 6న రిలీజ్ లాక్ చేశారు.

Also Read : Kamal Hassan : కమల్ పారితోషికం పెంచడంపై ఇంట్రెస్టింగ్ న్యూస్..!