Arya : 20ఏళ్ళ ఆర్య.. ప్రేక్షకులతో అప్పటి జ్ఞాపకాలను షేర్ చేసుకున్న మూవీ టీం..

ఆర్య 20 ఏళ్ళు పార్టీలో మూవీ టీం అంతా అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు.

  • Written By:
  • Publish Date - May 8, 2024 / 10:19 AM IST

Arya : సుకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతూ దిల్ రాజు నిర్మాణంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఆర్య’. 2004 మే 7న రిలీజైన ఈ చిత్రం 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. దీంతో మూవీ టీం నిన్న రీ యూనియోన్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో మూవీ టీం అంతా అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు.

ఈ సినిమా కథని అల్లు అర్జున్ కంటే ముందు రవితేజ, ప్రభాస్ కి వినిపించారట. కానీ ఫైనల్ గా అల్లు అర్జున్ తో మూవీని పట్టాలు ఎక్కించారు.

గంగోత్రి సినిమా హిట్ అయిన తరువాత అల్లు అర్జున్ ఏడాది పాటు మరో సినిమా చేయకుండా ఖాళీగా ఉన్నారు. అందుకు కారణం.. గంగోత్రి హిట్ అయినా, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కి మాత్రం మార్కులు పడలేదు. అలాగే లుక్స్ కూడా పెద్దగా బాగోలేదని కామెంట్స్ వినిపించాయి. దీంతో అల్లు అర్జున్ దగ్గరకి పెద్ద చెప్పుకోదగ్గ కథలు వచ్చేవి కాదట. ఆ సమయంలో ఆర్య తన దగ్గరకి వచ్చినట్లు అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

ఈ సినిమా కోసం హీరోని వెతుకుతున్న సమయంలో సుకుమార్ కి అల్లు అర్జున్ కనిపించారు. బన్నీ చూడగానే ఆర్య క్యారెక్టర్ కి తానే కరెక్ట్ అని ఫీల్ అయ్యారట. ఆ విషయాన్ని దిల్ రాజుకి చెబితే ముందు ఒప్పుకోలేదట. కానీ తరువాత కన్విన్స్ అయ్యి బన్నీ కలిసి సుకుమార్ తో ఆర్య కథ వినిపించారు.

ఆర్య రిలీజైన తరువాత ప్రతి ఒక్కరు బాగుంది. 10 వారలు (70 రోజులు) తప్పకుండా ఆడుతుందని చెబుతున్నారట. కానీ అల్లు అర్జున్ మాత్రం ఆ మాటలకు బాగా హర్ట్ అయ్యారట. వంద రోజుల సినిమాని పట్టుకొని 10 వారలు సినిమా అంటారేంటి..? మీరు చూడండి.. ఆర్య 125 రోజులు ఆడకపోతే నేను పేరు మార్చుకుంటా అని చెప్పారట. అల్లు అర్జున్ అన్నట్లే.. 125 రోజుల షీల్డ్ ని చిరంజీవి చేతుల మీదుగా అందుకున్నారు.

ఇక ఈ సినిమా చిత్రీకరణ సమయంలో దిల్ రాజు అండ్ సుకుమార్ మధ్య చాలా గొడవలు అయ్యేవాట. అప్పటిలో సినిమా రీల్స్ ఉపయోగించేవారు కదా. ఆ రీల్స్ ఎక్కువ అయితే ఖర్చు పెరిగేది. అలా ఖర్చు పెరిగే సమయంలో దిల్ రాజు.. సుకుమార్ ని కొట్టేవారంట.

ఈ సినిమాలోని ‘ఎదో ప్రియ రాగం వింటున్న’ సాంగ్ షూట్ చేసేటప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిందట. ఆ సమయంలో అల్లు అర్జున్, సుకుమార్ ని కాపాడాడు అంట. అయితే కాపాడిన వెంటనే బన్నీ సుకుమార్ దగ్గర ఒక మాట తీసుకున్నారట. నువ్వు నాకు ప్రతిఫలంగా నాతో ఏడు సినిమాలు చేయాలని అడిగారట. అందుకు సుకుమార్ కూడా ఓకే చెప్పారట.

ఈ సినిమాలోని ‘ఆ అంటే అమలాపురం’ సాంగ్ ఎంతటి హిట్టో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సాంగ్ పెట్టడానికి సుకుమార్ ఇష్టపడలేదట. ఐటెం సాంగ్ వద్దని గొడవ చేశారట. కానీ రిలీజ్ తరువాత ఆ సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి.. తన ప్రతి సినిమాలో ఐటెం సాంగ్ వచ్చేలా చూసుకుంటున్నారట.