Site icon HashtagU Telugu

Allu Arjun : అట్లీ సినిమా కోసం బన్నీ మైండ్ బ్లాక్ రెమ్యునరేషన్..!

Another Record for Allu Arjun South Number 1 Pushpa Raj

Another Record for Allu Arjun South Number 1 Pushpa Raj

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) చేసే సినిమాపై క్లారిటీ రావాల్సి ఉంది. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రం డైరెక్షన్ లో ఉంటుందని చెబుతుంటే కాదు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో ఉంటుందని కొందరు అంటున్నారు. ఈ ఇద్దరిలో మొదట అల్లు అర్జున్ ఎవరి డైరెక్షన్ లో చేస్తాడన్నది త్వరలో తెలుస్తుంది. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ విషయంపై క్లారిటీ వస్తుందని అంటున్నారు.

ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం అల్లు అర్జున్ అట్లీ తోనే తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. జవాన్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అట్లీ అల్లు అర్జున్ తో కలిసి మరో భారీ పాన్ ఇండియా సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఆల్రెడీ కథా చర్చలు కూడా పూర్తయ్యాయని టాక్. అట్లీ అల్లు అర్జున్ కాంబో సినిమాను సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ రెండు నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తాయని అంటున్నారు.

ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది. పుష్ప తో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న బన్నీ ఇక మీదట తన ప్రతి సినిమా నేషనల్ లెవెల్ లో చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తన రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప 2 కి కూడా భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న అల్లు అర్జున్ అట్లీ సినిమా కోసం ఏకంగా 120 కోట్ల దాకా రెమ్యునరేషన్ గా అందుకుంటున్నాడని తెలుస్తుంది.

ప్రస్తుతానికి ప్రభాస్ ఒక్కడే నేషనల్ లెవెల్ లో 150 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటూ సత్తా చాటుతున్నాడు. ఇక ఇప్పుడు ఆ నెక్స్ట్ ప్లేస్ లో అల్లు అర్జున్ 120 కోట్లతో అదరగొట్టబోతున్నాడు. అల్లు అర్జున్ అట్లీ రెమ్యునరేషన్ లెక్కలతోనే దుమ్ము దులిపేస్తున్నాడని తెలుస్తుంది.

Also Read : Anushka Trisha : అనుష్క నో అంటే త్రిషకు ఛాన్స్ ఇచ్చారా..?