ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) లేటెస్ట్ గా బాలయ్య అన్ స్టాపబుల్ (Unstoppable) టాక్ షోలో పాల్గొన్నారు. Balakrishna అన్ స్టాపబుల్ సీజన్ 4 లో భాగంగా అల్లు అర్జున్ స్పెషల్ ఎపిసోడ్ ఈమధ్యనే వదిలారు. ఐతే ఈ టాక్ షోలో మిగతా హీరోల గురించి అల్లు అర్జున్ తన మనసులో మాటని చెప్పారు. మహేష్ (Mahesh) ఫోటో చూపించి అల్లు అర్జున్ అభిప్రాయాన్ని చెప్పమనగా ఆయన ఫెయిల్యూర్ అయిన తర్వాత ఇచ్చే కంబ్యాక్ చాలా ఇష్టమని అన్నారు. అంతేకాదు టాలీవుడ్ స్టాండర్డ్స్ ని పెంచిన హీరో మహేష్ అని అన్నారు అల్లు అర్జున్.
ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక నేషనల్ అవార్డ్ రావడం గురించి చెబుతూ నేషనల్ అవార్డ్ పొందిన వారిలో ఒక్క తెలుగు హీరో పేరు లేకపోవడం బాధకలిగిందని. అందుకే దాన్ని టార్గెట్ పెట్టుకుని ఈసారి కొడితే అది రావాలని ప్లాన్ చేసినట్టు చెప్పారు.
పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్..
పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ కొట్టిన అల్లు అర్జున్ పుష్ప 2 తో మరో సంచలనానికి రెడీ అవుతున్నారు. సుకుమార్ ఈ రెండో భాగాన్ని కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. సినిమాపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని తెలుస్తుంది. పుష్ప 2 కోసం దేవి శ్రీ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తుండగా ఈసారి బిజిఎం కోసం థమన్ ని కూడా వాడుతున్నారని తెలుస్తుంది.
డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అవుతుంది. ఈ సినిమా విషయంలో పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న అంచనాలు చూస్తుంటే 1000 కోట్లు కొల్లగొట్టేలా ఉందని చెప్పొచ్చు.
Also Read : Balakrishna Daku Maharaj Teaser : బాలయ్య డాకు మహారాజ్ టీజర్.. ప్యూర్ గూస్ బంప్స్..!