Allu Arjun : పెళ్ళైనా అల్లు అర్జున్ ఇప్పటికీ వన్ సైడ్ లవరేనా..?

Allu Arjun పుష్ప 1 తో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా చేస్తే

Published By: HashtagU Telugu Desk
Allu Arjun Koratala Siva is on Cards

Allu Arjun Koratala Siva is on Cards

Allu Arjun పుష్ప 1 తో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా చేస్తే పక్కా హిట్ అనేలా సెంటిమెంట్ ఏర్పడింది. ఆర్యతో మొదలైన వీరి సూపర్ హిట్ కాంబో పుష్ప దాకా కొనసాగుతూ వచ్చింది. రీసెంట్ గా ఆర్య 20 ఏళ్ల ఉసవం జరుపుకున్న విషయం తెలిసిందే. ఆర్య 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు.

ఆర్య డైరెక్టర్, హీరో సుకుమార్ అల్లు అర్జున్ ఇద్దరు ఆ వేడుకకు వచ్చారు. ఆర్యలో నటించిన టీం అంతా కూడా ఈ ఈవెంట్ కి వచ్చారు. ఈ క్రమంలో అందరు తమ స్పీచ్ లతో 20 ఏళ్లు వెనక్కి ఆర్య షూటింగ్ టైం కు తీసుకెళ్లారు. అయితే ఈ క్రమంలో యాంకర్ అల్లు అర్జున్ ని ఒక ప్రశ్న అడిగింది. మీ ఫీల్ మై లవ్ గురించి చెప్పండి అంటే.. అతను తన భార్య స్నేహాను ఇప్పటికీ వన్ సైడ్ లవ్ చేస్తున్నానని అన్నాడు అల్లు అర్జున్.

స్నేహా అల్లు అర్జున్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరి అలాంటిది అల్లు అర్జున్ వన్ సైడ్ లవర్ అని ఎలా అన్నాడు అన్నది ఆడియన్స్ కు అర్ధం కాలేదు. కానీ బన్నీ మాత్రం తాను తన భార్యని వన్ సైడ్ లవ్ చేస్తున్నా అన్నారు. అంటే స్నేహా కన్నా ఎక్కువ తనే ప్రేమిస్తున్నట్టు అల్లు అర్జున్ అభిప్రాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా భార్యతో తనది వన్ సైడ్ అని చెప్పడంలో అల్లు అర్జున్ లాజిక్ ఏమో కానీ కొందరు నెటిజెన్లు దీన్ని కూడా బూతద్ధం పెట్టి చూస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Sai Pallavi : సాయి పల్లవి బర్త్ డే.. తండేల్ టీం స్పెషల్ వీడియో..!

  Last Updated: 09 May 2024, 11:18 AM IST