సినిమా అంటేనే రంగుల ప్రపంచం.. ఆ రంగుల ప్రపంచంలో రాత్రికి రాత్రే స్టార్స్ గా అయినవాళ్లు, సూపర్ స్టార్స్ అయినవాళ్లు ఉన్నాయి. పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోగా ప్రమోషన్ పొందాడు అల్లు అర్జున్ (Allu Arjun). ఆర్ఆర్ఆర్ క్రేజ్ లో కూడా తానెంటో చాటిచెప్పాడు ఈ ఐకాన్ స్టార్. తాజాగా ఈ హీరో పుష్ప2 మూవీ కోసం బిజీబిజీగా ఉన్నాడు. ఈ హీరోకు పలు బాలీవుడ్ ఆఫర్లు కూడా వచ్చినా ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు.
అయితే అల్లు అర్జున్ కు షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ (Jawan) మూవీలో నటింపజేసేందుకు మేకర్స్ కూడా కాంటాక్ట్ అయ్యారు. బిజీ షెడ్యూల్ వల్ల అల్లు అర్జున్ జవాన్ ఆఫర్ ను రిజక్ట్ చేశాడని లేటెస్ట్ టాక్. అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పటికే చాలా కమిట్‌మెంట్స్ ఒప్పుకున్నాడు. దీంతో భారీ ఆఫర్‌ను తిరస్కరించాల్సి వస్తోంది. నయనతార మహిళా ప్రధాన పాత్రలో నటించిన షారుఖ్ ఖాన్ రాబోయే భారీ ప్రాజెక్ట్ జవాన్‌లో అతిధి పాత్రలో నటించడానికి అర్జున్ ‘నో’ చెప్పినట్లు సమాచారం.
అయితే తన రాబోయే ప్రాజెక్ట్ పుష్ప: ది రూల్ (పుష్ప 2) పై దృష్టి పెట్టడానికి SRK చిత్రాన్ని తిరస్కరించాడు. అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. 2021 బ్లాక్‌బస్టర్ హిట్ పుష్ప: ది రైజ్‌కి చాలా ఎదురుచూసిన సీక్వెల్ మూవీ. అయితే అల్లు అర్జున్ నో చెప్పడంతో ఇద్దరు స్టార్స్ ఒకే ప్రేమ్ లో చూడాలనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. భవిష్యత్తులోనైనా ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
Also Read: Sudheer Babu Look: సుధీర్ బాబు ఏంటీ.. ఇలా మారిపోయాడు!