Site icon HashtagU Telugu

Allu Arjun : రేవతి కుటుంబానికి 25 లక్షలు.. ఘటన పై స్పందన..!

Police Grills Allu Arjun

Police Grills Allu Arjun

పుష్ప 2 (Pushpa 2) ప్రీమియర్స్ టైం లో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు ఆమె కొడుకు కూడా ఈ సంఘటనలో గాయాలపాలై హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఈ విషయంపై నిర్మాతలు స్పందించి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటామని. జరిగిన సంఘటన వల్ల మేము చాలా బాధపడుతున్నామని ప్రకటించారు.

ఇక పుష్ప 2 హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కూడా ఈ విషయంపై స్పందించారు. రేవతి గారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి ప్రకటించారు అల్లు అర్జున్. రేవతి (Revathi) గారి కుటుంబానికి అండగా ఉంటామని. ఆమె కుటుంబానికి 25 లక్షల ఆర్ధిక సాయం చేస్తున్నామని అన్నారు. వారి కొడుకు హాస్పిటల్ ఖర్చు కూడా మేమే భరిస్తామని. ఇదే కాకుండ ఫ్యూచర్ లో కూడా ఆ ఫ్యామిలీ (Family)కి ఏం కావాలన్నా తాను ఉంటామని అన్నాడు అల్లు అర్జున్.

మేము సినిమాలు తీసేదే మీ ఆనందం కోసం కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా బాధ కలుగుతుందని అన్నారు. ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి చిత్ర యూనిట్ చాలా ఎమోషనల్ అయ్యిందని.. ఇలాంటివి మళ్లీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు అల్లు అర్జున్. సినిమా చూసేప్పుడు ముందు మీరు జాగ్రత్తగా ఉండండని అన్నారు అల్లు అర్జున్.

పుష్ప 2 ప్రీమియర్స్ టైం లో అల్లు అర్జున్ ముందస్తు జాగ్రత్తలు లేకుండా వచ్చాడన్న టాక్ ఉంది. అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా థియేటర్ లోకి వచ్చారు. ఆ రద్దీలోనే తొక్కిసలాట జరిగింది. దీనిపై పోలీసులు కూడా కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తుంది.