Allu Arjun ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 69వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా ఉత్తమ నటుడు అవార్డుని కైవసం చేసుకున్నారు. రెండు నెలల క్రితమే ఈ అవార్డుల ప్రకటన జరుగగా ఈరోజు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను అందించారు. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ (National Award) అందుకున్నారు. పుష్ప పార్ట్ 1 సినిమాకు గాను అల్లు అర్జున్ ఈ అవార్డ్ అందుకోవడం విశేషం. తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో ఏ హీరో సాధించలేని ఘనత అల్లు అర్జున్ సాధించాడు. జాతీయ ఉత్తమ నటుడిగా తెలుగు పరిశ్రమ నుంచి ఉత్తమ నటుడి కేటగిరిలో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్న మొదటి హీరోగా నిలిచారు.
సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన పుష్ప 1 (Pushpa 1) సినిమా లో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపం ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. కథ కథనాలే కాదు పుష్ప రాజ్ యాటిట్యూడ్ కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది. సుకుమార్ (Sukumar) అల్లు అర్జున్ ఆర్య నుంచి వీరిద్దరు కలిసి ఎప్పుడు సినిమా చేసినా అది ఆడియన్స్ ని నిరాశపరచదు. ఆర్య, ఆర్య 2 తర్వాత పుష్ప తో పాన్ ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టించారు.
పుష్ప 1 తోనే నేషనల్ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 లో వీర లెవెల్ లో యాక్టింగ్ చేశాడని అంటున్నారు. ముఖ్యంగా అమ్మవారి అవతారంలో పుష్ప రాజ్ లుక్ సోషల్ మీడియాని షేక్ చేసింది. పుష్ప 2 (Pushpa 2) తో కూడా అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. పుష్ప 2 సినిమాను 2024 ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా విషయంలో కూడా ఎక్కడ కాప్రమైజ్ అవకుండా దర్శక నిర్మాతలు సినిమా తెరకెక్కిస్తున్నారు.
Also Read : Niharika Konidela : నిహారిక తట్టుకోలేకపోతుందా..? మనల్ని తట్టుకోలేకుండా చేస్తుందా..?