Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప-2 బ్లాక్ బస్టర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీతో అల్లు అర్జున్ నటన మరో స్థాయిలో ఉందని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. రష్మిక నటన సైతం అద్భుతంగా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి మైత్రీ మూవీ నిర్మాతగా వ్యవహరించింది. ఈ మూవీలో సునీల్, రావు రమేష్, జగపతిబాబు, అనసూయ, తదితరులు కీలక పాత్రలు పోషించారు.
రూ. వెయ్యి కోట్ల క్లబ్‌లోకి పుష్ప-2
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప2’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ మంగళవారం డిసెంబర్ 10వ తేదీతో బాక్సాఫీస్ బరిలో రూ.1,000 కోట్ల వసూలు చేసిన భారతీయ సినిమాల జాబితాలో ‘పుష్ప2’ చేరింది. కేవలం వారంలో ఈ ఘనత సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
Also Read: Cars Huge Discounts: ఈ కార్లపై డిసెంబర్‌లో భారీగా తగ్గింపులు!
టూర్లకు సిద్ధమైన బన్నీ
పుష్ప-2 హిట్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ దేశ వ్యాప్తంగా మరో టూర్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పుష్ప-2 రిలీజ్‌కు ముందు ప్రమోషన్ల కోసం ఐకాన్ స్టార్ దేశవ్యాప్తంగా తిరిగి తన అభిమానులను కలుసుకుని సినిమాను ప్రమోట్ చేశారు. ఈ సినిమా ఇప్పుడు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. బన్నీ కెరీర్‌లోనే కాదు టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన సినిమా పుష్ప-2. అందుకే తనని ఆదరించిన అభిమానులకు, మీడియాకూ థ్యాంక్స్ చెప్పుకోవాలని బన్నీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే వచ్చే వారం దేశ వ్యాప్తంగా మరో టూర్‌కు బన్నీ సిద్ధమయ్యాడు. దేశంలోని ప్రధానమైన పట్టణాలకు వెళ్లి.. థ్యాంక్స్ మీట్‌లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆఖరి ఈవెంట్ హైదరాబాద్ లో ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇటీవల బన్నీ ఓ ప్రెస్ మీట్ పెట్టి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, అభిమానులకు థాంక్స్ చెప్పాడు.