Site icon HashtagU Telugu

Pushpa 2 : పుష్ప పార్ట్ 3 కూడా ఉందట.. టైటిల్ అదేనట..!

Nagababu Tweet About Pushpa 2

Nagababu Tweet About Pushpa 2

Pushpa 2 : దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగం ఆడియన్స్ ముందుకు వచ్చి బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. కేవలం కలెక్షన్స్ మాత్రమే కాదు, కమర్షియల్ కంటెంట్ తో జాతీయ అవార్డులను కూడా అందుకొని సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఆడియన్స్ అంతా ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ లో ఈ రెండో భాగం రిలీజ్ కాబోతుంది. కాగా ఈ మూవీకి మూడో భాగం కూడా ఉండబోతుందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.

ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ లో సుకుమార్ మాట్లాడుతూ.. మా ఇద్దరి (అల్లు అర్జున్ & సుకుమార్) కేవలం రెండు భాగాల సినిమాలు మాత్రమే కాదు, కొనసాగింపుగా మూడు నాలుగు ఐదు సినిమాలు కూడా వస్తాయంటూ కామెంట్ చేశారు. ఇక ఈ కామెంట్స్ తో పుష్ప 3 వార్తల పై మరింత బజ్ పెరిగింది. కాగా తాజాగా వినిపిస్తున్న వార్తల్లో మూడో భాగం టైటిల్ కూడా వినిపిస్తుంది. మొదటి భాగానికి ‘పుష్ప ది రైజ్’, రెండో భాగానికి ‘పుష్ప ది రూల్’ అనే టైటిల్స్ ని పెట్టిన సంగతి తెలిసిందే. ఇక మూడో భాగానికి ‘పుష్ప ది రోర్’ అనే టైటిల్ ని ఖరారు చేశారట.

మరి ఈ మూడో భాగం వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే.. సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. పుష్ప ది రూల్ మూవీని ఈ ఏడాది డిసెంబర్ 6న రిలీజ్ చేసేందుకు తేదీని ఫిక్స్ చేశారు. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికి ఒక రెండు పాటలు, రెండు టీజర్ లు రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ ని అందుకున్నాయి.