Pushpa 2 : క్లైమాక్స్ షూటింగ్‌లో పుష్ప.. పార్ట్ 3కి కనెక్షన్ ఇచ్చేలా..!

పుష్ప 2 షూటింగ్ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ప్రస్తుతం ఫిలిం వర్గాల్లో హల్‌చల్ చేస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Allu Arjun Rashmika Mandanna Pushpa 2 Shooting Update

Allu Arjun Rashmika Mandanna Pushpa 2 Shooting Update

Pushpa 2 : పాన్ ఇండియా ఆడియన్స్ అంతా పుష్ప 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఆగష్టులో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. కాగా ఈ షూటింగ్ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ప్రస్తుతం ఫిలిం వర్గాల్లో హల్‌చల్ చేస్తుంది.

ప్రస్తుతం ఈ మూవీ క్లైమాక్స్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతుందట. ఇక ఈ షెడ్యూల్ ని చాలా జాగ్రత్తలు తీసుకోని సుకుమార్ తెరకెక్కిస్తున్నారట. ముఖ్యంగా షూటింగ్ సెట్స్ లోకి ఫోన్స్ కి పర్మిషన్ లేదట. అంతేకాదు, చాలా తక్కువమంది క్రూతో ఆ షెడ్యూల్ ని తెరకెక్కిస్తున్నారట. ఎందుకంటే, క్లైమాక్స్ లో పుష్ప 3కి కనెక్షన్ ఇచ్చేలా సీన్ ఉంటుందట. ఈ మూవీకి కొనసాగింపుగా మూడో భాగం ఉంటుందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఆ వార్తలు నిజమెంత ఉంది, ఇప్పుడు వినిపిస్తున్న వార్తలో నిజమెంత ఉంది అనేది తెలియాలంటే.. ఆగష్టు వరకు వేచి చూడాల్సిందే. కాగా ఈ సెకండ్ పార్ట్ లో మెయిన్ విలన్ గా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. సునీల్, అనసూయ, రావు రమేష్, ధనుజయ్, తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ మూవీ ఐటెం సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ కనిపించబోతుందట.

మొదటి భాగంలో ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా’ అంటూ సమంత ఒక ఊపు ఊపేసింది. దీంతో సెకండ్ పార్ట్ ఐటెం సాంగ్ పై భారీ హైప్ నెలకుంది. దేవిశ్రీ ప్రసాద్ ఎలాంటి ట్యూన్ తయారు చేసారు..? ఈసారి ఏ భామ పుష్పతో డాన్స్ వేయబోతుంది..? అనేది ఆసక్తిగా మారింది. యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ఈ పాటలో మెరవబోతున్నట్లు సమాచారం.

  Last Updated: 28 May 2024, 06:43 PM IST