Pushpa 2 : పుష్ప 2 నిజంగా వాయిదా పడుతుందా..? కారణం మెగా వెర్సస్ అల్లు..!

పుష్ప 2 నిజంగా వాయిదా పడుతుందా..? ఈ పోస్టుపోన్ కి కారణం మెగా వెర్సస్ అల్లు వివాదమే..

  • Written By:
  • Publish Date - June 14, 2024 / 12:02 PM IST

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప 1’. ఈ మూవీ సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ అంచనాలు, లెక్కలు మొన్నటి వరుకే అని, ఏపీ ఎన్నికల తరువాత పుష్ప 2 పై ఉన్న క్యూరియాసిటీ తగ్గిందని కొందరు అంటున్నారు. దీంతో ఈ మూవీ రిలీజ్ ని కూడా వాయిదా వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనంతటికి మెగా వెర్సస్ అల్లు వివాదమే కారణమని చెబుతున్నారు.

ఈసారి జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ పై పవన్ గట్టి పోరాటం చేసిన సంగతి తెలిసిందే. పవన్ కోసం మెగా హీరోలు కూడా కదిలివచ్చి కష్టపడ్డారు. కానీ అల్లు అర్జున్ మాత్రం.. వీరికి విరుద్ధంగా వెళ్లి వైసీపీ లీడర్ కి ప్రచారం చేసారు. తన కుటుంబంలోని వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ ని కాదని, తన భార్య స్నేహితురాలు భర్త కోసం అల్లు అర్జున్ ప్రచారం చేయడం.. మెగా అభిమానులకు ఆగ్రహాన్ని కలిగించింది. కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, తెలుగు ఆడియన్స్ చాలా మంది అల్లు అర్జున్ చేసిన పనిని విమర్శిస్తున్నారు.

సినీ, రాజకీయ రంగానికి చెందిన వ్యక్తులు కూడా అల్లు అర్జున్ ని తప్పు బడుతున్నారు. దీంతో అల్లు అర్జున్ పై చాలా నెగటివిటీ వస్తుంది. ఇది ఇలా ఉంటే, ఆగస్టులో విడుదల కావాల్సిన పుష్ప 2ని డిసెంబర్ కి వాయిదా వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వాయిదాకి కారణం మెగా వెర్సస్ అల్లు వివాదమే కారణమని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పై ఉన్న నెగటివిటీకి పుష్ప 2 రిలీజ్ అవుతే బాక్స్ ఆఫీస్ వద్ద ఇబ్బందులు తప్పవని, అందుకే వాయిదా వేస్తున్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి మూవీని నిజంగానే వాయిదా వేస్తున్నారా..? అనేది తెలియాల్సి ఉంది.