Site icon HashtagU Telugu

Pushpa: పుష్ప మూవీ చూసి స్టూడెంట్స్ చెడిపోతున్నారా.. భారీగా విమర్శలు, నెగిటివ్ కామెంట్స్!

Pushpa

Pushpa

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. అయితే పుష్ప సినిమా తర్వాత అదే తరహాలో చాలామంది దొంగతనాలకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం పట్ల కొంతమంది విమర్శలు కూడా ఒప్పించారు. అయితే కొంతమంది సినిమాలో క్యారెక్టర్ల పట్ల స్పందిస్తూ మండిపడుతున్నారు. స్మగ్లింగ్ చేసే పాత్రలు పోషిస్తే నేషనల్ అవార్డు ఇస్తారా? అసలు ఆ పాత్ర ఏంటి? నెగెటివ్ షేడ్స్ ఉన్న కారెక్టర్లకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? పిల్లలు చెడిపోతోన్నారు? అంటూ ఇలా చాలానే విమర్శలు వచ్చాయి.

ప్రస్తుత రోజుల్లో పిల్లలు మంచి కంటే చెడు ఎక్కువగా తీసుకుంటున్నారు. అదే సినిమాల్లో హత్యలు ఎలా చేయాలి. కొత్త రకమైన నేరాలు ఎలా చేయాలో చూపిస్తే మాత్రం ఎక్కడో ఒక చోట వాటిని ఆచరిస్తుంటారు. సినిమాల ప్రభావం సమాజం మీద అయితే ఖచ్చితంగా ఉంటుంది. మంచి కంటే చెడుని రిఫరెన్సుగా తీసుకునే వారు ఉన్నారు.పుష్ప కంటే ముందు చాలా మంచి సినిమాలు వచ్చాయి. కానీ పుష్ప లాంటి చిత్రాలను చూసి మాత్రం స్మగ్లింగ్స్ చేస్తూ పట్టు బడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇక పుష్ప లాంటి కారెక్టర్‌ ను జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. చిన్న పిల్లలు సైతం పుష్పలా బిహేవ్ చేస్తున్నారు. చప్రీ బ్యాచ్‌ లా మారిపోతోన్నారు. ఇన్ స్టాలో రీల్స్ చూస్తేనే ఆ విషయం అందరికీ బాగా అర్థమైపోతుంది.పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ చేసినట్టుగా హ్యాండ్ మూమెంట్స్, తగ్గేదేలే అనడం, ఆ జుట్టు, ఆ స్టైల్, మాట తీరు ఇలా అన్నీ పిల్లల్లోకి ఎక్కేశాయి.

పిల్లలు సైతం తమను తాము పుష్ప అని అనుకునేలా మారిపోయింది. ఇదే విషయాన్ని తాజాగా ఒక స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడింది. తాను యూసుఫ్ గూడ ప్రిన్సిపాల్ అని తన స్టూడెంట్స్ పుష్ప చిత్రాన్ని చూసి చెడిపోతోన్నారని, ఆ జుట్టు, బట్టలు, మాట తీరు అన్నీ కూడా మార్చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. సినిమాల్లో మంచి చెడూ రెండూ ఉంటాయి. కానీ చాలా మంది చెడుకే ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. ఈ విషయాన్ని తల్లి దండ్రులు కూడా కాస్త గమనిస్తూ ఉండాలని ఆమె అన్నారు. ఇలాంటి పనులు చేయొద్దు అని సినిమాల్లో చూపిస్తూ ఉన్నా కూడా అలాంటి పనులే చేస్తుంటారు. అలా సినిమాల ప్రభావం అయితే సమాజం మీద ఉంటుంది. ఏది మంచి? ఏది చెడు? అనేది ఇంట్లో, స్కూల్లో పిల్లలకు నేర్చించాల్సి ఉంటుంది. అంతే కానీ కేవలం పుష్ప వల్లే స్టూడెంట్లు చెడిపోతోన్నారని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో అని ఇంకొంత మంది కామెంట్లు చేస్తున్నారు.