అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 1.. 3 ఏళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇక రాబోతున్న పుష్ప 2 గురించి పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరోసారి పుష్ప 2 లో హైలెట్ అయ్యేలా ఉంది.
ఇక ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 17న రిలీజ్ ప్లాన్ చేశారు. పాట్నాలో భారీ సభగా ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 ట్రైలర్ (Pushpa 2 Trailer) నిడివి ఎంత అన్నది రివీలైంది. 2 నిమిషాల 44 సెకన్ల ప్యూర్ మాస్ అప్పీల్ తో ట్రైలర్ రాబోతుంది. ఈ ట్రైలర్ ఫైర్ ఫైర్ అనిపించేలా ఉంది. పాన్ ఇండియా ఆడియన్స్ మొత్తం పుష్ప రాజ్ మేనియాలో మునిగితేలేలా ట్రైలర్ రాబోతుంది.
20 వేల టికెట్స్..
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న పుష్ప 2 సినిమాలో శ్రీలీల కూడా స్పెషల్ సాంగ్ లో మెరవబోతుంది. పుష్ప 2 సినిమాకు యూఎస్ లో భారీ క్రేజ్ ఏర్పడింది. అందుకే సినిమా రిలీజ్ నెల రోజుల ముందు 20 వేల టికెట్స్ బుక్ అయ్యాయి. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 12000 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. చూస్తుంటే పుష్ప 2 సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారేలా ఉంది.
పుష్ప 2 సినిమా విషయంలో సుకుమార్ (Sukumar) పర్ఫెక్ట్ ప్లాన్ తో వెళ్తున్నారు. దేశం మొత్తం మీద 7 మెగా ఈవెంట్స్ తో పుష్ప 2 ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ఈవెంట్స్ తో పుష్ప 2 మేనియా తారాస్థాయికి చేరనుంది.
Also Read : Devara 2 : దేవర 2 కష్టమేనా.. ఫ్యాన్స్ ఏమంటున్నారు..?