అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వల్ పుష్ప 2 పై ఆడియన్స్ అంతా ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ గట్టి ప్లానింగ్ లోనే ఉన్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన టీజర్ అంచనాలు పెంచగా ట్రైలర్ కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పుష్ప 2 సినిమా ట్రైలర్ నవంబర్ 17 సాయంత్రం 5 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఐతే ఈ ట్రైలర్ రిలీజ్ వేడుక పాట్నాలో జరుగుతుందని తెలుస్తుంది. సినిమా గురించి పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 1 కన్నా పుష్ప 2లోనే అసలు కథ ఉంటుందని చెప్పిన సుకుమార్ (Sukumar) దీన్ని ఎలా తెరకెక్కించాడో అని అందరు ఆసక్తిగా ఉన్నారు.
శ్రీలీల స్పెషల్ సాంగ్..
పుష్ప 2 (Pushpa 2) సినిమా లో మరోసారి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ చేసేలా ఉంది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తుంది. నవంబర్ 17 నుంచి పుష్ప హంగామా షురూ అవుతుంది. మరి పుష్ప 2 పై ఉన్న అంచనాలకు సినిమా ఆ రేంజ్ కిక్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.
పుష్ప 2 సినిమాను పాన్ వరల్డ్ లెవెల్ లో భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 12 వేల సెంటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. యూఎస్ లో ఇప్పటికే 20వేల ప్రీ బుకింగ్స్ తో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది పుష్ప 2.