Allu Arjun Pushpa 2 : పుష్ప 2.. ఆ విషయం తేల్చని మేకర్స్..!

డిసెంబర్ 6న రావడం పక్కా అని తెలుస్తుంది. రిలీజ్ కన్ఫర్మ్ అయినా పుష్ప 2 గురించి ఇంకా కొన్ని డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది. పుష్ప 1 లో ఉ అంటావా మావ సాంగ్ ని సమంత

Published By: HashtagU Telugu Desk
Allu Arjun Pushpa 2 Special Song Confusion Continues

Allu Arjun Pushpa 2 Special Song Confusion Continues

సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 1 సెన్సేషనల్ హిట్ కాగా ఆడియన్స్ అంతా కూడా పుష్ప 2 (Pushpa 2) కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 సినిమా ఆగష్టు 15న రిలీజ్ చేయాలని అనుకోగా అది కాస్త డిసెంబర్ కి వాయిదా వేశారు. ఒక్క పుష్ప వాయిదా వల్ల చాలా సినిమా షెడ్యూల్ రీ షెడ్యూల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక అక్టోబర్ 10న రిలీజ్ అనుకున్న దేవర కాస్త సెప్టెంబర్ 27న వస్తున్నాడు.

ఐతే పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న రావడం పక్కా అని తెలుస్తుంది. రిలీజ్ కన్ఫర్మ్ అయినా పుష్ప 2 గురించి ఇంకా కొన్ని డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది. పుష్ప 1 లో ఉ అంటావా మావ సాంగ్ ని సమంత (Samantha) చేసింది. ఆ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తున్నారు అన్నది ఇంకా బయటకు రాలేదు.

ఎవరెవరివో పేర్లు వినిపిస్తున్నాయి కానీ వాటిల్లో ఏది నిజం అన్నది మాత్రం తెలియట్లేదు. పుష్ప 2 సినిమా లో స్పెషల్ ఐటం సాంగ్ కోసం భారీ ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్ (Sukumar). ఐతే సినిమా రిలీజ్ వరకు దాన్ని సీక్రెట్ గా ఉంచాలని చూస్తున్నారట. పుష్ప 2 లో రష్మిక మందన్న పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది.

పుష్ప రాజ్ భార్యగా రష్మిక మందన్న (Rashmika Mandanna) చేస్తున్న శ్రీవల్లి (Srivalli)కి మంచి సీన్స్ పడ్డాయని అంటున్నారు. ఇక మరోసారి దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడని చెప్పుకుంటున్నారు. మరి పుష్ప 2 సినిమా లో స్పెషల్ సాంగ్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారన్నది చూడాలి. పుష్ప 2 సినిమాలో ఇంకా చాలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. సినిమాపై ఆడియన్స్ ఎన్ని అంచనాలు ఉన్నాయో వాటికి ఏమాత్రం తగ్గకుండా సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Also Read : Kiran Abbavaram Ka : కిరణ్ అబ్బవరం క.. అలాంటి కథతో వస్తున్నాడా..?

  Last Updated: 12 Jul 2024, 06:11 PM IST