Site icon HashtagU Telugu

Allu Arjun : పుష్ప 2 రిలీజ్ మళ్లీ మారుతుందా..?

Aalu Arjun Pushpa 2

Aalu Arjun Pushpa 2

సుకుమార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్ లో పుష్ప 1 తో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో పార్ట్ 2 ని అంతకుమించి అనిపించేలా చేస్తున్నారు. పుష్ప 2 విషయంలో చిత్ర యూనిట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. Sukumar పుష్ప 2 సినిమా రిలీజ్ అసలైతే ఆగష్టు 15న ప్లాన్ చేసినా అది కుదరలేదు. ఫైనల్ గా డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ లాక్ చేశారు. ఐతే పుష్ప 2 రిలీజ్ డేట్ పై మేకర్స్ మళ్లీ ఆడియన్స్ ని కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ మళ్లీ మారుతుందని అంటున్నారు.

అయితే ఈసారి మరీ వెనక్కి కాకుండా జస్ట్ ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 5న సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఒకరోజులో పోయేది ఏముంది అన్నది కాదు. ఎవరి లెక్కలు వారికి ఉంటాయి కాబట్టి పుష్ప 2 సినిమా విషయంలో మేకర్స్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నారు. ఈ సీక్వెల్ పై ఎన్ని అంచనాలు ఉన్నాయో వాటికి ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండాలని చూస్తున్నారు.

పుష్ప 2 సినిమా ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్..

పుష్ప 2 (Pushpa 2,) రిలీజ్ డేట్ డిసెంబర్ 6న లాక్ చేయగా ఒకరోజు ముందే అంటే డిసెంబర్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. అంటే ఓవర్సీస్ లో 4 నైట్ నుంచే సినిమా ప్రీమియర్స్ వేస్తారు. సో మొత్తానికి పుష్ప 2 సినిమా ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.

పుష్ప 2 లో అల్లు అర్జున్ మరోసారి తన నట విశ్వరూపం చూపిస్తాడని అంటున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటిస్తుందని టాక్.

Also Read : Nani Hit 3 : నాని హిట్ 3.. లీక్స్ కి రీజన్ ఏంటి..?