Mega vs Allu : మెగా వెర్సస్ అల్లు బాక్సాఫీస్ ఫైట్ రాబోతోందా..? డిసెంబర్‌లో చరణ్, బన్నీ..!

మెగా వెర్సస్ అల్లు బాక్సాఫీస్ ఫైట్ రాబోతోందా..? పుష్ప 2తో బన్నీ, గేమ్ ఛేంజర్ తో చరణ్..

  • Written By:
  • Publish Date - June 16, 2024 / 03:33 PM IST

Mega vs Allu : ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా వెర్సస్ అల్లు సైలెంట్ వార్ నడుస్తుంది. ఏపీ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ వైపు నిలబడితే, అల్లు అర్జున్ మాత్రం వైసీపీ లీడర్ కోసం వెళ్లడం.. మెగా అభిమానులకు, మెగా కుటుంబసభ్యులకు ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో ప్రస్తుతం మెగా వెర్సస్ అల్లు ఫైట్ హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ ఫైట్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ని కూడా తాకబోతుందని తెలుస్తుంది.

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాని ఈ ఆగష్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ గతంలో అనౌన్స్ చేసారు. అయితే ఇప్పుడు ఆ డేట్ నుంచి పుష్ప తప్పుకున్నట్లు, సినిమాని డిసెంబర్ కి వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిత్ర యూనిట్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇక్కడ విశేషం ఏంటంటే.. రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాని కూడా డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట.

తమిళ స్టార్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం.. గత మూడేళ్ళుగా చిత్రీకరణ జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమా రిలీజ్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మొన్నటివరకు ఈ మూవీ దివాళీకి వస్తుందని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు క్రిస్మస్ కానుకగా రాబోతుందని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ ఈ రెండు సినిమాలకు సంబంధించిన తాజా వార్తలు నిజమైతే.. బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ఆసక్తికర ఫైట్ రాబోతుందనే చెప్పాలి. ఈ రెండు సినిమాల్లో చరణ్, బన్నీ కెరీర్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ గా వస్తున్నాయి. పుష్ప 1కి పాన్ ఇండియా హిట్టుతో పాటు నేషనల్ అవార్డు కూడా రావడంతో పుష్ప 2 బన్నీకి కీలకంగా మారింది. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్టు తరువాత చరణ్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ కావడం, దానికి శంకర్ దర్శకుడు కావడం అనేది చరణ్ కి కీలకంగా మారింది. మరి పోటీ నిజమైతే గెలుపు ఎవరిదో చూడాలి.