Pushpa 2 : పుష్ప 2 షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఏ సీన్ చేస్తున్నారో తెలుసా?

పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Allu Arjun Pushpa 2 Movie Shooting Update

Allu Arjun Pushpa 2 Movie Shooting Update

అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప(Pushpa) సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అవ్వడమే కాకుండా నేషనల్ అవార్డు కూడా అందుకొని మొదటి తెలుగు హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు. పుష్ప సాంగ్స్, డైలాగ్స్ ప్రపంచమంతా వైరల్ అయ్యాయి. దీంతో పుష్ప 2 సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల రామోజీ ఫిలింసిటీ, అనంతరం వైజాగ్ పోర్ట్ లో పుష్ప 2 షూటింగ్ జరిగింది. ఇప్పుడు నంద్యాల దగ్గర బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రంలో పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. యాగంటి ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం, ఇక్కడ నంది ప్రత్యేకమైనది అని తెలిసిందే.

ఈ సినిమాలో పుష్ప బాగా డబ్బున్న వాడిగా ఎదుగుతాడని మొదటి పార్ట్ లో చూపించారు. రష్మికతో పెళ్లి కూడా అవుతుంది. సెకండ్ పార్ట్ లో రష్మిక యాగంటిలో ఉన్న ఉమామహేశ్వర స్వామి వారికి బంగారు కిరీటం అందించే సీన్ షూట్ చేస్తున్నారట. ఆల్రెడీ నిన్న షూట్ జరగ్గా, ఇవాళ కూడా అక్కడే షూట్ జరగనుందని సమాచారం. అయితే ఈ సీన్ లో అల్లు అర్జున్ లేడని తెలుస్తుంది. రష్మిక వచ్చిందని తెలియడంతో షూటింగ్ వద్దకు యాగంటి జనాలు భారీగా వచ్చారు.

ఇక పుష్ప 2 సినిమా నుంచి ఆల్రెడీ ఓ గ్లింప్స్ రిలీజ్ చేయగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుంది. దీంతో బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 

Also Read : MB Foundation : పిల్లల గుండె ఆరోగ్యంపై మహేష్ బాబు ఫౌండేషన్ మరో మంచి పని..

  Last Updated: 20 Mar 2024, 06:14 AM IST