Site icon HashtagU Telugu

Pushpa 2 : పుష్ప 2 కొత్త వర్షన్ నేటి నుంచే.. కానీ తెలుగు ప్రేక్షకులకు నో ఛాన్స్..

Allu Arjun Pushpa 2 Movie 3D Version Released only in Hindi

Pushpa 2

Pushpa 2 : అల్లు అర్జున్ ఓ పక్క సంధ్య థియేటర్ వివాదంలో ఉన్నా మరో పక్క పుష్ప 2 సినిమా మాత్రం థియేటర్స్ ఇంకా అదరగొడుతుంది. ఇప్పటికే ఈ సినిమా 1500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. హిందీలో ఏకంగా 700 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. థియేటర్స్ లో, ముఖ్యంగా నార్త్ లో పుష్ప 2 హవా ఇప్పట్లో తగ్గేలా లేదు.

పుష్ప 2 సినిమా మొదటి నుంచి 2D లోనే కాక పలు వెర్షన్స్ లో రిలీజ్ చేసారు. 3D లో కూడా రిలీజ్ చేస్తారని చెప్పినా పలు కారణాలతో రిలీజ్ చేయలేదు. తాజాగా పుష్ప 2 హిందీ వర్షన్ 3D లో నేటి నుంచి అందుబాటులో ఉందని ప్రకటించింది మూవీ యూనిట్. దీంతో నార్త్ లో ఈ సినిమాని 3D లో చూడటానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కొత్త వర్షన్ తో పుష్ప 2కి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

అయితే ఈ 3D వర్షన్ కేవలం హిందీలోనే అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు వేరే భాషల్లో కూడా అందుబాటులో లేదు. ఇప్పట్లో వచ్చే ఛాన్స్ కూడా కనపడట్లేదు. దీంతో తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమా అయి ఉంది తెలుగులో 3D వర్షన్ రిలీజ్ చేయకుండా హిందీలో చేయడం ఏంటి అంటూ విమర్శిస్తున్నారు. మీరు ఈ సినిమా 3D లో చూడాలంటే హిందీలో చూడాల్సిందే ప్రస్తుతానికి.

 

Also Read : Unstoppable : బాలయ్య – వెంకటేష్ ఆహా అన్‌స్టాప‌బుల్ ప్రోమో వచ్చేసింది.. ఇద్దరు హీరోలు కలిసి ఫుల్ ఎంటర్టైన్మెంట్..