సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 సినిమా డిసెంబర్లో రిలీజ్ అని తెలిసిందే. మూడేళ్ల క్రితం పుష్ప 1 రిలీజ్ కాగా అది సంచలన విజయం అందుకుంది. పుష్ప 2 (Pushpa 2) అసలైతే ఆగస్టు 15న రిలీజ్ ప్లాన్ చేసినా షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల సినిమా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. పుష్ప 2 గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సుకుమార్ అల్లు అర్జున్ మధ్య దూరం పెరిగింది అనే వార్తలు కూడా వచ్చాయి.
జరిగిన ఏపీ ఎలక్షన్స్ (AP Elections) లో అల్లు అర్జున్ (Allu Arjun) తన స్నేహితుడు నంద్యాల అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్ చేయడం అల్లు అర్జున్ ని మెగా ఫాన్స్ కి కంటయ్యేలా చేసింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ మీద ఫైర్ మీద ఉన్నారు. ఈ ఇంపాక్ట్ కచ్చితంగా పుష్ప రెండో భాగం మీద పడుతుందని చెప్పొచ్చు. డిసెంబర్ 6న రిలీజ్ ప్లాన్ చేసిన పుష్ప 2 సినిమా జరుగుతున్న షూటింగ్ లేట్ వల్ల అప్పటివరకు వస్తుందా లేదా అన్న డౌట్ కూడా వ్యక్తపరుస్తున్నారు.
పుష్ప 1 ఒక రేంజ్ లో హిట్ అవ్వటం వల్ల పుష్ప 2 బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. పుష్ప 2 కోసం బాలీవుడ్ (Bollywood) ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప 2కి పాజిటివ్ టాక్ వస్తే రికార్డ్ కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. పుష్ప 2 భారీ టార్గెట్ తోనే రంగంలోకి దిగుతుంది అని చెప్పొచ్చు. అంచనాలకు తగినట్టుగా ఉంటే ఇది 1000 కోట్ల దాకా బాక్సాఫీస్ లెక్కలు రాబట్టే అవకాశం ఉంది. అయితే మెగా ఫ్యాన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అండదండలు లేకుండా పుష్ప 2 ఆ టార్గెట్ రీచ్ అవ్వటం సాధ్యపడుతుందా లేదా అన్న డౌట్ మొదలైంది.
ఇప్పటికే కల్కితో ప్రభాస్ తన ఖాతాలో మరో వెయ్యి కోట్ల సినిమా వేసుకున్నాడు. పుష్ప 1 సూపర్ హిట్ అవ్వటంతో పుష్ప 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగినట్టుగా ఉంటే పుష్ప 2 కూడా భారీ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. మరి పుష్ప 2 బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉంటాయి అన్నది రిలీజ్ అయితేనే కానీ చెప్పగలం.