Site icon HashtagU Telugu

Allu Arjun Pushpa 2 : ఆ భాషలో రిలీజ్ అవుతున్న మొదటి సినిమా పుష్ప 2.. నెవర్ బిఫోర్ రికార్డు..!

Is Vijay Devarakonda screening in Pushpa 3

Is Vijay Devarakonda screening in Pushpa 3

Allu Arjun Pushpa 2 సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప 1 సంచలన విజయం అందుకోగా ఆ సినిమా కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2 భారీ అంచనాలతో వస్తుంది. పుష్ప 2 నుంచి వచ్చిన ప్రచార చిత్రాలన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలు ఏర్పరచింది. సుకుమార్ ఈ పార్ట్ తో కూడా పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది.

పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 2 పై ఏర్పడ్డ అంచనాలకు తగినట్టుగానే సినిమా బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. హిందీలో కూడా ఈ సినిమాకు బిజినెస్ అదిరిపోతుంది. ఇదిలాఉంటే ఈ సినిమాను సౌత్ అన్ని భాషలతో పాటుగా హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తారని అనుకోగా లేటెస్ట్ గా సినిమాను బెంగాలి భాషలో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారని టాక్.

బాలీవుడ్ సినిమాల్లో కూడా చాలా అరుదుగా కొన్ని సినిమాలు బెంగలిలో రిలీజ్ అవుతాయి. అలాంటిది ఒక సౌత్ సినిమా అది కూడా ఒక తెలుగు సినిమా బెంగాలిలో రిలీజ్ అవ్వడం ఇదే మొదటిసారి. ఇన్నేళ్ల సినీ చరిత్రలో పుష్ప 2 మాత్రమే ఈ రికార్డుని సృష్టిస్తుంది.

బెంగాలిలో రిలీజ్ కోసం దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ ను అక్కడ సింగర్స్ తో పాడించే ఏర్పాట్లు చేస్తున్నారట. మొత్తానికి నార్త్ ఆడియన్స్ ను రీచ్ అయ్యేలా పుష్ప 2 ప్లానింగ్ భారీగానే ఉంటుందని తెలుస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 2 అత్యధిక థియేటర్ లో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

Also Read : Ileana : బాలీవుడ్ రావడం వల్లే అవకాశాలు తగ్గాయంటున్న ఇలియానా..!

Exit mobile version