Pushpa 2 Collections : పుష్ప 2 కి తమిళనాడులో భారీ నష్టాలు..

నార్త్ లో డబల్ ప్రాఫిట్స్ వచ్చాయి. కానీ చాలా చోట్ల పుష్ప 2 బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదని సమాచారం.

Published By: HashtagU Telugu Desk
Allu Arjun Pushpa 2 Losses in some Areas here Details

Pushpa 2 Loss

Pushpa 2 Collections : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా గత నెల డిసెంబర్ 5న రిలీజయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ తో రిలీజ్ కి ముందు థియేట్రికల్ బిజినెస్ భారీగా అయింది. మన తెలుగులోనే కాక అన్ని చోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఊహించనంతగా జరిగింది. దానికి తగ్గట్టు కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇప్పటివరకు 1831 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాహుబలి 2 రికార్డ్ కూడా బీట్ చేసింది.

పుష్ప 2 సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ నార్త్ నుంచే వచ్చాయి. నార్త్ లో డబల్ ప్రాఫిట్స్ వచ్చాయి. కానీ చాలా చోట్ల పుష్ప 2 బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదని సమాచారం. నార్త్ లో ఎక్కువ కలెక్షన్స్ రావడంతో ఓవరాల్ బ్రేక్ ఈవెన్, రికార్డులు చూపిస్తుంది కానీ చాలా చోట్ల పుష్ప 2 నష్టాల్లోనే ఉందని టాక్ నడుస్తుంది.

తాజాగా ఓ తమిళ పీఆర్ తమిళనాడులో పుష్ప 2 కలెక్షన్స్ పోస్ట్ చేసాడు. తమిళ్ లో బ్రేక్ ఈవెన్ 110 కోట్లు అయితే కేవలం 70 కోట్లే కలెక్ట్ చేసింది అని పోస్ట్ చేసారు. అంటే ఆల్మోస్ట్ 40 కోట్ల వరకు నష్టాలు వచ్చాయట. సంక్రాంతి సినిమాలు త్వరలోనే వస్తుండటంతో ఈ రేంజ్ కలెక్షన్స్ ఇక రావు అని తెలుస్తుంది. దీంతో తమిళ్ లో పుష్ప 2 భారీ నష్టాలతో ముగియనుంది. ఇక కేరళలో కూడా 30 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 20 కోట్లే వచ్చాయి. కేరళలో కూడా ఓ 10 కోట్లు నష్టాల్లో ఉన్నట్టే తెలుస్తుంది.

ఇక ఏపీలో కూడా కొన్ని ఏరియాలలో పుష్ప 2 ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదని తెలుస్తుంది. అమెరికాలో కూడా పుష్ప 2 జస్ట్ బ్రేక్ ఈవెన్ అయిందని, హిట్ కావాలంటే ఇంకా కలెక్ట్ చేయాల్సిందే అని తెలుస్తుంది.

 

Also Read : Game Changer : వాళ్లు ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌ ఎందుకు ఆపాలనుకున్నారు..!

  Last Updated: 07 Jan 2025, 11:59 AM IST