Site icon HashtagU Telugu

Allu Arjun Pushpa 2: పక్కా ప్లాన్ తోనే పుష్ప 2 రిలీజ్.. డైరెక్టర్ సుకుమార్ తక్కువోడు కాదు..!

Allu Arjun Pushpa 2

Compressjpeg.online 1280x720 Image

Allu Arjun Pushpa 2: అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 1 బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప-2 (Allu Arjun Pushpa 2) తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్ పై చిత్రబృందం సోమవారం చిత్రబృందం రిలీజ్ అప్ డేట్ ఇచ్చింది. పుష్ప-2 వచ్చే ఏడాది ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానుందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. బాక్సాఫీసు ఏలడానికి పుష్పరాజ్ మరోసారి వస్తున్నాడంటూ మైత్రీ మూవీ మేకర్స్ తన పోస్టులో పేర్కొంది.

పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్-సుకుమార్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే వచ్చే ఏడాది ఆగస్టు 15న థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ చేయటం వెనక డైరెక్టర్ సుకుమార్ పెద్ద ప్లానే వేశాడు. మూవీ రిలీజ్ ఆగస్టు 15 గురువారం సెలవు. దీని తర్వాత శుక్ర, శని, ఆదివారం వీకెండ్. సోమవారం రక్షా బంధన్ ఉంది. ఇలా ఐదు రోజుల లాంగ్ వీకెండ్ ఉంది. కాబట్టి పుష్ప 2 సినిమాని ఈ డేట్ లో రిలీజ్ చేస్తే భారీ వసూళ్లు దక్కే ఛాన్స్ ఉందని మూవీ మేకర్స్ ప్లాన్ తో ఈ మూవీ డేట్ ని రిలీజ్ చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది.

Also Read: President Kim Jong Un: రష్యాకు రైలులో వెళ్లిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్..!

2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్‌’ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. రికార్డులతో పాటు కలెక్షన్ల సునామీని కురిపించింది. ఎర్ర చందనం బ్యాగ్రౌండ్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప ది రూల్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. పుష్ప చిత్రం సృష్టించిన సంచలనం కారణంగా ‘పుష్ప 2’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప మూవీలో నటనకు గానూ ఇటీవల బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.