Allu Arjun : పుష్ప సినిమా నాకోసం అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ తో పాటు అందరూ బాగా కష్టపడినా సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా వారం రోజుల ముందు వరకు కూడా చేస్తూనే వచ్చారు. నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో అందరూ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఒకరి కష్టం గురించి ఒకరు గొప్పగా చెప్పుకున్నారు.
ఈ క్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ రష్మిక మందన్నని పొగిడేసాడు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అయిదేళ్ల నుంచి నాతో కలిసి పనిచేసిన రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తను కాకుండా వేరే వాళ్ళైతే ఈ ఐదేళ్లు ఎలా గడిచేవో కూడా నాకు తెలీదు. పీలింగ్స్ సాంగ్ కోసం రెండు రోజులపాటు కనీసం నిద్ర కూడా లేకుండా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా పనిచేసింది. తన కళ్ళను చూసి ఆశ్చర్యపోయి అసలు నిద్రపోయావా అని అడిగితే లేదు అంది. అది తెలిసి నాకు ఎంతో బాధ వేసింది. తను అంత ప్రొఫెషనల్ గా ఈ సినిమా కోసం పనిచేసింది. ఈ సినిమా రష్మికకు గొప్ప పేరు తీసుకురావాలి. ఇలాంటి అమ్మాయిలతో కలిసి పని చేయాలి అనిపించేలా పని చేశావు అని అన్నాడు. దీంతో బన్నీ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా రష్మికను అందరూ అభినందిస్తున్నారు.
Also Read : Pushpa 2 : స్టేజిపై పుష్ప నిర్మాతలు.. కౌంటర్ ఇచ్చిన అభిమాని.. టికెట్ రేటు 1200 అయితే ఎలా సర్?