Site icon HashtagU Telugu

Allu Arjun : హమ్మయ్య అల్లు అర్జున్ కూడా వచ్చేసాడు.. పవన్ కి సపోర్ట్ గా బన్నీ ట్వీట్..

Allu Arjun Post Tweet for Supporting Janasena Pawan Kalyan Tweet goes Viral

Allu Arjun Post Tweet for Supporting Janasena Pawan Kalyan Tweet goes Viral

Allu Arjun : ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జనసేనకు(Janasena), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు మద్దతు క్రమక్రమంగా పెరుగుతుంది. ఇన్నాళ్లు ఎవరూ రాలేదనుకున్నా రెండు రోజుల నుంచి వరుసగా సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియాలో మద్దతు లభిస్తుంది. మొదట చిరంజీవి పవన్ కళ్యాణ్ ని గెలిపించండి అంటూ ఓ వీడియో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయింది.

ఆ తర్వాత నాని, రాజ్ తరుణ్, రామ్ చరణ్, పలువురు డైరెక్టర్స్, నటీనటులు.. ఒక్కొక్కరిగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ, ఆయన్ని పిఠాపురంలో గెలిపించండి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చెసాతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, వరుణ్ తేజ్ పిఠాపురం వచ్చి స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. పవన్ కి మద్దతుగా జబర్దస్త్ కమెడియన్స్ అంతా వచ్చి ప్రచారం చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం పవన్ కి సపోర్ట్ చెయ్యట్లేదు అని కొంతమంది నెగిటివ్ గా ప్రచారం చేశారు.

దీనికి కౌంటర్ గా నేడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ట్వీట్ వేసాడు. ప్రజా సేవకు మీ జీవితాన్ని అంకితం చేసి మీరు ఎంచుకున్న మార్గం చూసి నేనెప్పుడూ గర్విస్తాను. ఒక ఫ్యామిలీ మెంబర్ గా కూడా నా ప్రేమ, సపోర్ట్ ఎల్లప్పుడూ మీకే. మీరు కోరుకున్నవాణ్ణి మీ ఎన్నికల జర్నీలో జరగాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేశాడు. దీంతో బన్నీ పోస్ట్ వైరల్ అవ్వగా బన్నీ అభిమానులు కూడా పవన్ కి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎవరు ఎన్ని చేసినా పిఠాపురంలో పవన్ గెలుపుని ఎవరూ ఆపలేరు అంటున్నారు అభిమానులు, కార్యకర్తలు.

 

Also Read : Allu Arjun : వాళ్ళ కోసం పది లక్షలు డొనేట్ చేసిన అల్లు అర్జున్..