సంధ్య థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టేయాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హైకోర్టు లో పిటిషన్ (Allu Arjun Petition in High Court) దాఖలు చేసారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లలోని సంధ్య థియేటర్ ( Sandhya Theatre) వద్ద ‘పుష్ప-2’ ప్రీమియర్ (‘Pushpa-2’ Premiere Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రీమియర్ షో కు అల్లు అర్జున్ రావడం తో అభిమానులు వేలాదిగా చేరుకోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో రేవంతి మృతి చెందగా..ఆమె కుమారుడు హాస్పటల్ లో కొనఊపిరి తో ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో రేవతి కుటుంబ సభ్యులు సంధ్య థియేటర్ యాజమాన్యం తో పాటు అల్లు అర్జున్ పై కేసు పెట్టారు. ఈ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్‌పై బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. మరి దీనిపై కోర్ట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
అంతకు ముందు ‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చింది. పైగా ప్రీమియర్ షో మేం నిర్వహించలేదు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారు. అయినా మా బాధ్యతగా బందోబస్తు కల్పించాం. అలాంటి మాపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయం’ అని పేర్కొన్నారు.
Read Also : Heeramandi.. The Diamond Bazaar : 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్