Site icon HashtagU Telugu

Allu Arjun : ఖైరతాబాద్ RTO ఆఫీస్ కు పుష్ప రాజ్..

Bunny Rto

Bunny Rto

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఖైరతాబాద్ RTO ఆఫీస్ లో సందడి చేసారు. ప్రస్తుతం బన్నీ..పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ – అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై పాన్ ఇండియా గా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో పుష్ప 2 ను అంతకు మించి ఉండేలా సుక్కు ప్లాన్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ తాజాగా తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ (International Driving License) పొందేందుకు ఈరోజు ఖైరతాబాద్ RTO కార్యాలయానికి వచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

సడెన్ గా అంత అవసరం ఏంటి అంటే.. పుష్ప2లో కొన్ని సీన్స్ జపాన్‌లో తీయనున్నారట. అందులో భాగంగానే అల్లు అర్జున్ అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీతో (Atlee) ఓ మాస్ యాక్షన్ మూవీని చేయబోతున్నాడు. ఈ సినిమాలో పూజా హగ్దే ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలోకి డీజే , ఆలా వైకుంఠపురం లో మూవీస్ వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడం తో మరోసారి ఈ కాంబో అనగానే అంచనాలు పెరుగుతున్నాయి.

Read Also : BRS Party: రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి సింగిరెడ్డి