Allu Arjun : అల్లు అర్జున్ నెక్స్ట్ సస్పెన్స్ వీడేది ఆరోజే..!

Allu Arjun పుష్ప 1 తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఆ సినిమా పార్ట్ 2 పుష్ప ది రూల్ సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను పూర్తి చేసే పనుల్లో చిత్ర యూనిట్ బిజీ బిజీగా ఉంది.

Published By: HashtagU Telugu Desk
Allu Arjun Shocking Comments on Mahesh Balakrishna Unstoppable

Allu Arjun Shocking Comments on Mahesh Balakrishna Unstoppable

Allu Arjun పుష్ప 1 తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఆ సినిమా పార్ట్ 2 పుష్ప ది రూల్ సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను పూర్తి చేసే పనుల్లో చిత్ర యూనిట్ బిజీ బిజీగా ఉంది. అయితే పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడా అన్న ఎగ్జైట్ మెంట్ ఆడియన్స్ లో ఉంది. పుష్ప 2 తర్వాత అసలైతే త్రివిక్రం డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా ఫిక్స్ చేశారు. కానీ జవాన్ డైరెక్టర్ అట్లీ కూడా బన్నీతో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు.

త్రివిక్రం సినిమా వెనక్కి నెట్టి అట్లీతో ముందు సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్. ఇటు త్రివిక్రం అటు అట్లీ ఇద్దరిలో బన్నీని ఎవరిని ఫైనల్ గా ఫిక్స్ చేస్తాడన్నది ఫ్యాన్స్ లో కూడ కన్ ఫ్యూజన్ మొదలైంది. అయితే ఈ కన్ ఫ్యూజన్ కి క్లారిటీ రావాలంటే మాత్రం ఏప్రిల్ మొదటి వారం వరకు వెయిట్ చేయాలని అంటున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే ఉంది. సో ఆరోజు బన్నీ నెక్స్ట్ సినిమాపై అఫీషియల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

అంతేకాదు పుష్ప 2 నుంచి మరో టీజర్ కూడా ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. వేర్ ఈజ్ పుష్ప అంటూ లాస్ట్ ఇయర్ పుష్ప 2 నుంచి ఒక వీడియో వదిలి సినిమాపై అంచనాలు పెంచాడు. బన్నీ బర్త్ డేకి మరో టీజర్ ని రెడీ చేస్తున్నారని టాక్. ఈ టీజర్ లో కేవలం పుష్ప రాజ్ మాత్రమే కాకుండా మిగతా పాత్రల పరిచయాలు ఉంటాయని చెబుతున్నారు.

Also Read : Mahesh Rajamouli : మహేష్ తర్వాత రాజమౌళి హీరో అతనేనా.. ఎవరు ఊహించని కాంబో..!

  Last Updated: 14 Mar 2024, 12:22 PM IST