అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప రాజ్ పాత్రలో పాన్ ఇండియాని షేక్ చేసిన విషయం తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప ది రైజ్ తో అదరగొట్టిన అల్లు అర్జున్ త్వరలో పుష్ప 2 తో రాబోతున్నాడు. పుష్ప 2 అంచనాలను మించి ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సుకుమార్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.
పుష్ప 2 సినిమా ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు. సినిమా అనుకున్న టైం కు రిలీజ్ చేసేందుకు డే అండ్ నైట్ కృషి చేస్తున్నారు. ఇదిలాఉంటే అల్లు అర్జున్ లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప రాజ్ లుక్ లానే ఉన్నా ఇది అల్ ట్రా మోడ్రెన్ లుక్ తో కనిపిస్తుంది. బ్లాక్ కలర్ డ్రెస్.. అదే బ్లాక్ కలర్ గాగుల్స్ తో కెవ్వు కేక అనిపిస్తున్నాడు అల్లు అర్జున్.
స్టైలిష్ స్టార్ గా తన స్క్రీన్ నేం కి పర్ఫెక్ట్ అనిపించుకుంటున్న అల్లు అర్జున్ కొత్త లుక్స్ తో అదరగొట్టేస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. బ్లాక్ డ్రెస్ లో పుష్ప రాజ్ అదుర్స్ అంటూ అల్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమా లో మరోసారి తన నట విశ్వరూపం చూపించనున్నాడు అల్లు అర్జున్. పుష్ప 1 తో నేషనల్ అవార్డ్ అందుకోగా పుష్ప 2 కి కూడా అందుకు తగినట్టుగానే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ తో వస్తున్నాడని తెలుస్తుంది.
Also Read : Alia Bhatt : ఆల్ అటెన్షన్ ఆన్ అలియా భట్.. కాట్ ఏ వైబ్ అంటూ కవ్విస్తున్న ముద్దుగుమ్మ..!