Site icon HashtagU Telugu

Allu Arjun: భన్సాలీతో ‘బన్నీ’.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేనా!

Allu Arjun

Allu Arjun

అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ కార్యాలయంలో కనిపించడంతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు ఒకింత ఆశ్చర్య వ్యక్తం చేశారు. భన్సాలీ ఆఫీస్ ఫోటోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షంకావడంతో వీరిద్దరి కలయిక హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ తన తొలి పాన్-ఇండియా చిత్రంతో ‘పుష్ప: ది రైజ్’ అద్భుతమైన విజయం అందుకున్నాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. అయితే తాజాగా అల్లు అర్జున్ ముంబైకి వెళ్లాడు.

సంజయ్ లీలా భన్సాలీ కార్యాలయానికి వెళ్లడంతో ఆసక్తి రేపుతోంది. భన్సాలీ అల్లు అర్జున్‌తో సినిమా చేస్తే ఓ రేంజ్ లో హిట్ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ కు హిందీ మార్కెట్ లో మంచి స్టార్ డమ్ ఉంది. కాగా అల్లు అర్జున్ సుకుమార్ ‘పుష్ప: ది రూల్’ కోసం రాబోయే షూటింగ్ షెడ్యూల్ కోసం సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాడు. పార్ట్-1 కోసం ఎంత కష్టపడ్డాడో, పార్ట్-2 కోసం అంతకమించి నటించేందుకు అర్జున్ ఆసక్తి కనబరుస్తున్నాడు. పుష్ప విజయంతో అల్లు అర్జున్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే.. ప్రభాస్ మాదిరిగా పాన్ ఇండియా హీరోగా మారిపోవడం ఖాయమే.

Exit mobile version