Allu Arjun: బన్నీ ఫ్యామిలీ కోసం ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తున్నారా.. లీక్ చేసిన ఉపాసన?

  • Written By:
  • Publish Date - April 9, 2024 / 01:17 PM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఆయనకున్న ఫాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ సినిమాలో పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాల గురించి తన సినిమాలకు సంబంధించిన విషయాల గురించి పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సౌత్ ఇండియాలోనే అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు బన్నీ. ఇంస్టాగ్రామ్ లో 25 మిలియన్ ఫాలోవర్స్ తో సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు. అయితే చాలా మంది సెలబ్రిటీలకు ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్, ప్రైవేట్ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join
అధికారిక అకౌంట్ ని సెలబ్రిటీలు మెయింటైన్ చేసినా ఆ సెలబ్రిటీ సోషల్ మీడియా టీం ఎక్కువగా చూస్తుంది. వాళ్ళే ఈ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ ని డీల్ చేస్తారు. సెలబ్రిటీస్ పబ్లిక్ లో కాస్త హుందాగా ఉండాలి కాబట్టి ఈ అధికారిక అకౌంట్స్ లో ఏది పడితే అది పోస్ట్ చేయలేరు, ఎవర్ని పడితే వాళ్ళని ఫాలో అవ్వలేరు, ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ తోనే తమ సోషల్ మీడియా అకౌంట్స్ ని వాడతారు. దీంతో కొంతమంది సెలబ్రిటీలు ప్రైవేట్ గా ఇంకో సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. వేరే పేరుతోనో, లేదా ప్రైవేట్ మోడ్ లో పెట్టుకొని మన సెలబ్రిటీలు ఇంకో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా వాడతారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కి కూడా ఇంకో ప్రైవేట్ అకౌంట్ ఉందని తెలిసిపోయింది.

Also Read: Kiran Abbavaram: నా సినిమా నేను చూడలేక మధ్యలోనే బయటికి వచ్చాను : కిరణ్ అబ్బవరం

ఉపాసన అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో విషెష్ చెప్తూ ఒక ఫొటో షేర్ చేసి అల్లు అర్జున్ అధికారిక అకౌంట్ తో పాటు అల్లు అర్జున్ ప్రైవేట్ అకౌంట్ ని కూడా ట్యాగ్ చేసింది. ఇంకేముంది ఈ అల్లు అర్జున్ ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వైరల్ గా మారింది. బన్నీ బాయ్ ప్రైవేట్ అనే పేరుతో అల్లు అర్జున్ ఈ ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇది కేవలం ఫ్యామిలీ, అతనికి క్లోజ్ అయిన వాళ్ళకే తెలుసు అని అర్ధమవుతుంది. ఈ అకౌంట్ బయోలో బన్నీ ఇది ప్రైవేట్ అకౌంట్, ఆలోచించకుండా ఏదైనా పోస్ట్ చేసాయడానికి అని రాసుకొచ్చారు. ఈ అకౌంట్ ప్రైవేట్ మోడ్ లో ఉండటంతో ఇందులోని పోస్ట్ లు ఎవరికీ కనపడవు. ఇప్పటికే ఈ అకౌంట్ లో బన్నీ 1300కి పైగా పోస్టులు పెట్టాడు. 300 మందికి పైగా బన్నీ ప్రైవేట్ అకౌంట్ ని ఫాలో అవుతుండగా బన్నీ 500 మందిని ఫాలో అవుతున్నాడు ఈ అకౌంట్ నుంచి. ఒరిజినల్ అకౌంట్ నుంచి కేవలం ఒక్క తన భార్యనే ఫాలో అవుతుండటం గమనార్హం.

Also Read: Tamannaah Bhatia: నా బ్యూటీ సీక్రెట్స్ ఇవే.. అసలు విషయం లీక్ చేసిన తమన్నా?